నెల్లూరు నుంచి చెన్నై వెళ్తోన్న ట్రైన్ అది. ఏసీ భోగి వెలుపల ఉన్న స్లీపర్ క్లాస్ నుంచి ఏదో వింత వాసన ఒక్కసారిగా ప్రయాణీకులకు గుప్పుమని తగిలింది. రాత్రి సమయం కావడం.! అది కూడా అందరూ నిద్రపోతున్నారు కాబట్టి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ భోగిలోని ఒక ప్రయాణీకుడిపై కొందరికి డౌట్ వచ్చింది. ట్రైన్ సరిగ్గా అర్ధరాత్రి సమయంలో చెన్నైకి ఉత్తరాన శివారు ప్రాంతమైన మింజుర్ స్టేషన్‌కి చేరుకుంది. సదరు ప్రయాణీకుడు హుటాహుటిన తన దగ్గర ఉన్న సూట్‌కేసుతో దిగిపోయాడు. అతడి వెంటనే ఓ అమ్మాయి కూడా ఉండటం గమనార్హం.
ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్
ఇక ఆ స్టేషన్లో సూట్‌కేసు వదిలేసి.. మళ్లీ ట్రైన్ ఎక్కుతుండగా.. తోటి ప్రయాణీకులకు అనుమానం మరింతగా బలపడింది. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సూట్‌కేసును తనిఖీ చేసిన రైల్వే పోలీసులకు దెబ్బకు షాక్ తగిలింది. అందులో ఓ వృద్ధురాలి మృతదేహం ఉండటంతో.. సదరు ప్రయాణీకుడిని, అతడి వెంట వచ్చిన అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. నిందితుడు బాలసుబ్రమణ్యంగా పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి తలపై బలమైన గాయాలు ఉండటంతో హత్యకి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి, కూతురు వృద్దురాలిని హత్య చేసి సూట్‌కేసులో తీసుకొచ్చినట్టు ప్రాధమిక విచారణలో తేల్చారు పోలీసులు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..