తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో తెలుగు సినిమా రేంజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. దాంతో తెలుగులో సినిమాలు చేయడానికి ఇతర నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇతర బాషల హీరో హీరోయిన్స్ క్యూ కడుతున్నారు. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరోలు కూడా తెలుగు దర్శకులతో సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. దళపతి విజయ్ వంశీ పైడిపల్లితో వారసుడు, ధనుష్ వెంకీ అట్లూరితో సార్, దుల్కర్ సల్మాన్ హనురాఘవపూడితో సీతారామం, వెంకీ అట్లూరితో లక్కీ భాస్కర్ సినిమాలు చేసి మెప్పించారు. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.?
రీసెంట్ గా విడుదలైన తండేల్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో చందూ మొండేటి మంచి విజయాన్ని అందుకున్నాడు. దాంతో చందూ మొండేటికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు ఓ స్టార్ హీరోతో చందూ మొండేటి సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ నటుడు సూర్య. కాగా సూర్య చివరిగా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 350 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు దాటలేకపోయింది.
దీని తరువాత, సూర్య తన 44వ చిత్రం రెట్రో కోసం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో జతకట్టాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత, సూర్య తన 45వ సినిమా కోసం నటుడు, దర్శకుడు RJ బాలాజీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పనులు కూడా వేగంగా జరుగుతుండగా, సూర్య నెక్ట్స్ సినిమా పై క్రేజీ అప్డేట్ వచ్చింది. తెలుగు దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చందూ మొండేటి మాట్లాడుతూ.. సూర్యతో సినిమా చేస్తున్నట్టు తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి