ఇక బీఎస్‌ఈలో రూ.412 రూపాయల వద్ద ప్రారంభమయ్యాయి. స్విగ్గీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 8న ముగిసింది. ధరల శ్రేణిని రూ.371-390గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.6828 కోట్లు సమీకరించనుంది. అయితే సబ్‌స్క్రిప్షన్ తొలి రోజు అంతంత మాత్రమే ఆదరణ నోచుకున్న స్విగ్గీ ఐపీఓ చివరి రోజున మాత్రం అనూహ్య స్పందన లభించింది. రూ.11,327 కోట్ల ఐపీఓ మొత్తం 3.599 రెట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. 16 కోట్ల షేర్లకు గానూ 57.53 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 6.02 రెట్లు సబ్‌స్క్రైబ్ అవ్వగా.. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 1.14 రెట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కోటా 41 శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇప్పటికే రూ.5,085 కోట్లు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: