ఈ హీరోయిన్ గుర్తుందా.? తెలుగు తమిళ్ భాషల్లో తోప్ హీరోయిన్ ఆమె.. ఇప్పుడు ఆమె సినిమాలు తగ్గించింది ఫ్యామిలీతో గడిపేస్తుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు చిరంజీవి. నాగార్జున, బాలకృష్ణ , వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
Actress
స్టార్ హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవడం కామన్. హీరోయిన్స్ కూడా అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో బిజీ కాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటారు. ఒకప్పుడు వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బిజీగా గడిపిన చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు బాగా గ్యాప్ ఇస్తున్నారు. యంగ్ హీరోయిన్స్ రంగంలోకి దిగడంతో చాలా మంది సీనియర్ భామలు కనుమరుగయ్యారు. కొంతమంది అడపాదడపా సినిమాలు చేస్తున్నారు మరికొంతమంది మాత్రం సెకండ్ హీరోయిన్స్ గా లేదా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. పైన కనిపిస్తున్న భామ కూడా అదే క్యాటగిరికి చెందింది. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసింది ఆ అమ్మడు. ఈ అమ్మడు అందానికి అందరూ ఫిదా అయ్యారు.
ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు అంతగా అవకాశాలు లేక ఫ్యామిలీతో విదేశాల్లో గడుపుతోంది. ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ శ్రియ. ఈ చిన్నది టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోలు కూడా ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూసేవారు అప్పట్లో అంత బిజీగా గడిపింది శ్రియ.
ఇవి కూడా చదవండి
తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. నటనతో పాటు అందంలోనూ ఈ అమ్మడు అదరగొట్టింది. ఇక ఇప్పుడు నాలుగు పదుల వయసులోనూ శ్రియ తన అందాలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శ్రియ సినిమాలకు గ్యాప్ ఇస్తుంది. అడపదడపా సినిమాల్లో నటిస్తుంది. మొన్నామధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న రోల్ లో కనిపించింది. ఇక ఇప్పుడు భర్త కూతురితో సమయాన్ని గడుపుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.