పూర్తిస్థాయి వృక్ష శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేస్తూనే.. షాన్ 2023 మే నెలలో “ది గ్రేవ్ క్లీనర్” పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అప్పటి నుండి 300 సమాధులను శుభ్రపరిచాడు. డీప్ క్లీనింగ్ నుండి మొదలుకొని అక్షరాలకు రంగులు వేయడం, అలంకరణ చిప్‌లను జోడించడం వంటి సేవలను అందిస్తాడు. ఒక్కో సమాధికి $187 నుండి $562 వరకు సంపాదిస్తూ తన ఇంటి డౌన్ పేమెంట్ కోసం డబ్బును సంపాదించాడు. డిసెంబర్ 2024లో అతని కుటుంబం వారి సొంత ఇంటిలోకి అడుగుపెట్టింది.
సోషల్ మీడియాలో ప్రచారం
షాన్ తన ఖాళీ రోజుల్లో వారాంతాల్లో సమాధులు శుభ్రం చేస్తాడు. రోజుకు రెండు నుండి నాలుగు సమాధుల వరకు శుభ్రపరుస్తాడు. అతని పని టిక్‌టాక్, ఫేస్‌బుక్ వంటి సామజిక మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం పొందింది. అక్కడ @thegravecleaner పేరుతో తన పనికి సంబంధించిన వీడియోలను పంచుకుంటాడు.
సంతృప్తితో కూడిన పని
“నేను విజయవంతమైన వ్యాపారాన్ని నడపాలని, చాలా మంది చేయలేని సేవను అందించాలని ప్రయత్నిస్తున్నాను” అని షాన్ అన్నాడు. “ఇది చాలా సంతృప్తికరమైనది అదేవిధంగా లాభదాయకమైన పని. తమ ప్రియమైనవారి సమాధులను ఎలా శుభ్రం చేయాలో తెలియని వారికి సహాయం చేయడం ఆనందంగా ఉంది” అని తెలిపాడు.
ఆర్థిక స్థిరత్వం
షాన్ అంకితభావం అతనికి సొంత ఇంటి కోసం కట్టాల్సిన డౌన్ పేమెంట్ కోసం డబ్బు ఆదా చేయడానికి సహాయపడింది. ఒకప్పుడు కల అనుకున్నది ఇప్పుడు నిజమైంది. “ఈ ఉద్యోగం నా కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చింది. ఇది చాలా గొప్ప విషయం” అని షాన్ అన్నాడు. డిసెంబర్ 2024లో షాన్ అతని కుటుంబం వారి సొంత ఇంటికి మారారు. “ఇది మాకు ఒక విధంగా ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చింది. ఇది నాకు చాలా పెద్ద విజయం” అని అతను చెప్పాడు.
వ్యక్తిగత సేవ
షాన్ తన క్లయింట్‌లకు సమాధి పరిమాణం, అక్షరాల రకం, గోల్డ్ లీఫ్ లేదా పెయింట్ అవసరమా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సేవలను అందిస్తాడు. అతనికి ఈ పని చాలా వరకు సోషల్ మీడియా ద్వారా వస్తుంది. ప్రజలకు తెలియజేయడానికి కరపత్రాలు, కార్డులను కూడా పంచుతాడు. “ఈ సేవ అందుబాటులో ఉందని చాలా మందికి తెలియదు” అని ఆయన వివరించారు. “నేను ఉద్యోగం కోసం స్మశానవాటికకు వెళ్లినప్పుడు, ప్రజలు తరచుగా వస్తారు” అని షాన్ తెలిపాడు.
స్థిరమైన ఆదాయం
ఈ వ్యాపారం ఆర్థిక స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిగత సంతృప్తిని కూడా తెచ్చిపెట్టింది. “నా కుటుంబానికి జీవితాన్ని అందించడానికి ఇది నాకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో ఇది సాధ్యమవుతుందని మేము అనుకోలేదు” కానీ సాధ్యమయినందుకు సంతోషంగా ఉంది అని షాన్ సంతోషంగా చెప్పాడు.