సాధారణంగా మైదానంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు లేదా బౌలర్లపై ఆగ్రహావేశాలు చూపించడం సర్వసాధారణం. అయితే విండీస్ ఆల్‌రౌండర్ అల్జారీ జోసెఫ్ తన సొంత జట్టు కెప్టెన్‌తోనే గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య గొడవ తీవ్రతరం కావడంతో.. ఆ తర్వాత మైదానం విడిచి వెళ్లిపోయాడు జోసెఫ్. బార్బడోస్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ నాలుగో ఓవర్ వేసేందుకు జోసెఫ్ సిద్దం కాగా.. ఆ సమయంలో కెప్టెన్ హోప్ పెట్టిన ఫీల్డింగ్.. అతనికి నచ్చలేదు. ఫీల్డింగ్ విషయంలో కొన్ని మార్పులు చెప్పినా.. కెప్టెన్ పట్టించుకోకపోవడంతో.. జోసెఫ్ అసంతృప్తికి లోనయ్యి.. మైదానం వదిలి వెళ్లాడు.
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!
ఇవి కూడా చదవండి
ఇక జోసెఫ్ వేసిన ఓ బౌన్సర్‌ను తప్పించపోయి.. వికెట్ల వెనుక షాయ్ హోప్‌కు చిక్కాడు ఇంగ్లాండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్(1). మరోవైపు నాలుగో ఓవర్ ముగిసేసరికి మైదానం వీడిన అల్జారీ జోసెఫ్.. ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగి వచ్చాడు. 10 ఓవర్లు పూర్తి చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అటు విండీస్ కోచ్ డారెన్ సామీ కూడా బౌండరీ లైన్ వెలుపల ఆటగాళ్లను నియంత్రిస్తూ కనిపించాడు. ఇక ఈ జోసెఫ్ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఐపీఎల్‌లో జోసెఫ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అతడ్ని ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా ఆ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది.
ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
Gets angry! 😡 Bowls a wicket maiden 👊 Leaves 🤯
An eventful commencement to the crippled for Alzarri Joseph! 😬#WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt
— FanCode (@FanCode) November 6, 2024
విండీస్ విజయం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇక లక్ష్యచేదనలో భాగంగా బరిలోకి దిగిన విండీస్‌కు.. బ్రాండన్ కింగ్(102), కీసీ కార్టీ(128) శతకాలతో అదరగొట్టారు. దీంతో విండీస్ 43 ఓవర్లలోనే 267 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో వన్డేలో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో వన్డేలో విండీస్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..