మనకు బంగారం, వెండి, రాగి, అల్యూమినియం వంటి లోహాల గురించి తెలుసు. వీటి ముడి ఖనిజాన్ని వెలికితీసి, శుద్ధి చేసి కరిగించడం ద్వారా వస్తువులు తయారు చేసుకుంటాం. ఇవే గాక నిత్య జీవితంలో ఇంకా అనేక రకాల లోహాలు, ఖనిజాలను మనకు తెలియకుండానే వినియోగిస్తున్నాం.
ఇలా శరీరంలో అమర్చే ఇంప్లాంట్స్ రూపంలోనే కాదు, చేతిలో ఉపయోగించే సెల్ ఫోన్ బ్యాటరీలలో ఉండే ‘లిథియం’ కూడా ఒక ఖనిజమే. కొన్ని ఖనిజాలను నేరుగా వెలికితీసి శుద్ధి చేసి వినియోగించుకోగల్గితే, కొన్నింటి తయారీకి మరికొన్ని ఖనిజాలతో మిశ్రమం చేయాల్సి ఉంటుంది. ముడి ఇనుము నుంచి ఇనుప లోహాన్ని తయారు చేయవచ్చు. దానికి మాంగనీసును కలిపితేనే ఉక్కు తయారవుతుంది. ఇనుము పెలుసుగా ఉంటుంది. ఉక్కుగా తయారు చేసినప్పుడే దానికి సాగే గుణం వస్తుంది. అలాగే బంగారంలోనూ కొంత రాగి మిశ్రమాన్ని కలిపితేనే సాగే గుణం వచ్చి ఆభరణాలు తయారవుతాయి. ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం “మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పెవిలియన్” కల్పిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా నవంబర్ నెలలో 2 వారాల పాటు అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ ప్రదర్శన జరుగుతుంది లోపలికి అడుగు పెట్టగానే షోకేసులో పెట్టిన వివిధ రకాల ముడి ఖనిజాలు కనిపిస్తాయి. పెవిలియన్ మధ్యలో క్యూబ్ ఆకారంలో స్క్రీన్, దానిపై వివిధ ఖనిజాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. క్యూబ్‌కు ఇరువైపులా ఏర్పాటు చేసిన టచ్ స్క్రీన్ మీద మరింత సమగ్రమైన సమాచారం అందుబాటులో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!
మిమ్మల్ని యంగ్ గా ఉంచే మ్యాజిక్ టీ.. ఈ పూలతో చేసే టీ తాగితే నిత్య యవ్వనం !!
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా ??
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం.. ఏం జరిగిందంటే ??