అయితే కాసేపటికే అది ఫేక్ వీడియో అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పిస్తోన్న నోరా మృతి చెందిందంటూ ఓ ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నోరా ఫతేహి బంగీ జంప్ చేసేందుకు ఎత్తైన ప్రదేశం నుంచి దూకిందని, రోప్ తెగిపోవడంతో ఆమె లోయలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని నకిలీ ఫోటోలు జత చేసి షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నోరా అభిమానులు, బంధువులు టెన్షన్ పడ్డారు. బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం నోరా ఫతేహి క్షేమంగా ఉన్నట్లు స్పష్టమైంది. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో కల్పితమని క్లారిటీ వచ్చింది. బంగీ జంప్ చేస్తూ మృతి చెందిన మహిళ, నోరా ఫతేహి కాదని తేలింది. దీంతో నోరా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం ఫేక్ వీడియో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకి ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ఇన్ స్టా గ్రామ్ పేజీ నిర్వాహకులు ఆ ఫేక్ వీడియోని తొలగించారు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నోరాకు నివాళి, సంతాపం తెలియజేస్తూ కామెంట్లు, పోస్టులు చేస్తూనే ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్
చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం
Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ