పెద్దపల్లి జిల్లా కు వెళ్తుండగా (బీహార్ కు చెందిన కూలీలు) తల్లిదండ్రులతో కలిసి ఓ చిన్నారి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తుండడాన్ని చూసి మంత్రి కొండా సురేఖ చలించి పోయారు. వెంటనే కారు ఆపి, ఆ చిన్నారిని చెప్పుల దుకాణంలోకి తీసుకెళ్లి, ఆ ఐదు సంవత్సరాల ఆ పాపకి చెప్పులు కొనిచ్చారు. అంతేకాదు, ఆ చిన్నారికి చిరిగిపోయిన డ్రెస్ ఉండడంతో తన సొంత ఖర్చులతో ఐదు డ్రస్సులను కొనుగోలు చేసి, తన తల్లిదండ్రులకు అప్పగించారు మంత్రి కొండా సురేఖ.
మీరు ఏ విధంగా అయితే చెప్పులు వేసుకుని నడుస్తున్నారో… మీ పాప కూడా అదే విధంగా చెప్పులు వేసుకుని నడవాలి…. పిల్లలకు కష్టం కలిగించొద్దని తల్లిదండ్రులకు హితవు పలికారు మంత్రి కొండా సురేఖ.
మంత్రి కొండ సురేఖ ఒకసారిగా కారు దిగడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మంత్రి సురేఖ పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం గ్రామం లోని కోదండ రామాలయంలో జరిగే ఒక కార్యక్రమానికి వెళుతూ కాలినడకన వెళ్తుండగా చెప్పులు లేకుండా కాలినడకతో వెళుతున్న ఆ పాపను చూసి మంత్రి సురేఖ ఒక్కసారిగా అక్కడే అగిపోయారు.
ఇవి కూడా చదవండి
సుల్తానాబాద్ లో 20 నిమిషాలు ఆ చిన్నారితో షాపింగ్ చేశారు. తనకు కవాల్సిన చెప్పులు, డ్రెస్సులు కొనివ్వడంతో స్థానికులు కొండా సురేఖ చేసిన మంచి పనిని పలువురు అభినందించారు… తరువాత చిన్నారి సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి