భారతదేశ ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎగుమతుల్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 800 బిలియన్ డాలర్లను సాధిస్తుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమన్నారు.
ఎగుమతుల పరంగా భారతదేశం చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తోంది. ఈ విషయంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ సమాచారం ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు తొలిసారిగా రికార్డు స్థాయిలో 800 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. జూన్ 2025 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఉల్లిపాయ, టమోటా, బంగాళాదుంపల ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని అందించింది.
భారత ఎగుమతులు పెరుగుతున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ రాజ్యసభకు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో ఎగుమతుల్లో మంచి పెరుగుదల నమోదు చేసింది. ఈ సంవత్సరం కూడా పెరుగుదల కొనసాగుతుంది. “భారతదేశ చరిత్రలో తొలిసారిగా, మన ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను దాటుతాయి” అని గోయల్ ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, భారతదేశ ఎగుమతులు పెరగుతున్నాయని స్పష్టం చేశారు.
విదేశీ మారక నిల్వలు పడిపోవడంపై ఉన్న ఆందోళనలను గోయల్ తోసిపుచ్చారు. చాలా నెలలుగా ఇది స్థిరంగా 600 బిలియన్ డాలర్లపైన ఉందని ఆయన అన్నారు. అయితే, దేశీయ కొరత, అధిక డిమాండ్ కారణంగా కొన్ని దిగుమతులు అవసరమని మంత్రి అన్నారు. దిగుమతుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం. దేశీయ వినియోగం పెరగడమే దీనికి కారణం. దిగుమతి చేసుకున్న వస్తువులలో పెట్రోలియం ఉత్పత్తులు, కోకింగ్ బొగ్గు, పప్పుధాన్యాలు, తినదగిన నూనెలు ఉన్నాయన్నారు.
‘ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసి ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ కాలంలో, దిగుమతులు స్పష్టంగా పెరుగుతాయి. ఒక ప్రాంతంలో దిగుమతులు పెరిగినప్పుడు, పరిశ్రమలు ఆ ప్రాంతం వైపు ఆకర్షితులవుతాయి. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. పెట్టుబడి కూడా పెరుగుతుంది. 2025-26 బడ్జెట్ మధ్యతరగతికి పన్ను ఉపశమనం కల్పించడం ద్వారా వినియోగ వ్యయాన్ని కూడా పెంచిందని కేంద్ర మంత్రి తెలిపారు. రాజ్యసభలో ఎగుమతుల అద్భుతమైన పనితీరును పియూష్ గోయల్ వివరించారు. దిగుమతులు పెరగడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా ఎగుమతుల వేగం చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
అదే సమయంలో, 2024-25లో ఉల్లిపాయలు, టమోటా, బంగాళాదుంపలు సహా అనేక ఉద్యానవన పంటల ఉత్పత్తి పెరుగుతుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లిపాయ ఉత్పత్తిలో గరిష్ట పెరుగుదల 19% ఉంటుంది. దీనితో పాటు, పండ్లు, తోటల పంటలు మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అయితే, మొత్తం సాగు విస్తీర్ణం గత సంవత్సరం కంటే కొంచెం తక్కువగా ఉంది.
ఉల్లిపాయల విషయానికొస్తే, ఈ సంవత్సరం దాని ఉత్పత్తి 288.77 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా. ఇది గత సంవత్సరం 242.67 లక్షల టన్నుల కంటే చాలా ఎక్కువ. టమోటా ఉత్పత్తి కూడా 215.49 లక్షల టన్నులుగా అంచనా వేశారు. బంగాళాదుంప ఉత్పత్తి 595.72 లక్షల టన్నులకు చేరుకుంటుంది. పండ్లలో, మామిడి, ద్రాక్ష, అరటి మంచి ఉత్పత్తి కారణంగా మొత్తం పండ్ల ఉత్పత్తి 1132.26 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా. తోటల పంటల ఉత్పత్తి 179.37 లక్షల టన్నులుగా, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 119.96 లక్షల టన్నులుగా అంచనా వేశారు. వెల్లుల్లి, పసుపు ఉత్పత్తిలో కూడా పెరుగుదల నమోదైంది. మొత్తంమీద, ఉద్యానవన ఉత్పత్తి 2024-25లో 362.09 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా, ఇది గత సంవత్సరం కంటే 2.07% ఎక్కువ. అయితే, సాగు విస్తీర్ణం గత సంవత్సరం 29.09 మిలియన్ హెక్టార్ల నుండి ఈ సంవత్సరం 28.84 మిలియన్ హెక్టార్లకు తగ్గింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..