Updated on: Feb 08, 2025 | 12:11 PM
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా అంటే లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు.. ఒక మహోన్నత మానవతామూర్తిగా, సమాజ సేవకుడిగా పేరు సంపాదించుకున్నారు. కాగా ఆయనకున్న వేల కోట్ల ఆస్తిని తన వద్ద పనిచేస్తున్న వారికి, పెంపుడు శునకాలకు ఇస్తూ వీలునామా రాశారు. తాజాగా బయటకు వచ్చిన మరో వీలునామా చూసి ఆయన సన్నిహితులు ఆశ్యర్యపోయారు. అందులో ఓ రహస్య వ్యక్తికి తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని రతన్‌టాటా రాసినట్లు తెలుస్తోంది.
ఆ రహస్య వ్యక్తి జంషెడ్‌పుర్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా అని పలు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. మోహన్ దత్తా ఆరు దశాబ్దాలకు పైగా రతన్‌టాటా దగ్గర నమ్మకంగా పని చేశారు. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో 2013 నుంచి మోహన్‌దత్తాకు చెందిన ‘‘స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ’’ కలిసి పనిచేస్తోంది. టాటా గ్రూప్‌కు చెందిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహన్‌దత్తా.. టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు. రతన్ టాటా మరణించినప్పుడు దత్తా ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. రతన్‌టాటా 24 ఏళ్ల వయసు ఉన్నప్పటినుంచి తనకు తెలుసని అన్నారు. తాను జీవితంలో ఎదగడానికి ఆయన ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. డిసెంబర్ 2024లో ముంబయిలోని NCPA లో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్
చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం
Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ