ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యానిమల్, కిల్ సినిమాలను మించి ఇండియాలోనే ది మోస్ట్ వయలెంట్ మూవీగా మార్కో గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్ ప్రియులు ఈ సినిమాను తెగ చూసేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది.
కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘మార్కో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ‘మార్కో’ డిసెంబర్ 20న మలయాళం లో రిలీజ్ అయింది. కాబట్టి ఈ మూవీని 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అంటే ఈ నెల ఆఖరున లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఈ యాక్షన్ సినిమా ఓటీటీలోకి రావచ్చు! ఇక మార్కో సినిమాకు హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. అలాగే షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. మార్కో సినిమాలో మితిమీరిన హింసను చూపించారనే అభిప్రాయం ఉంది. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ కారణంగా ఒక వర్గం ప్రజలు ఈ యాక్షన్ మూవీని ఇష్టపడలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న డార్లింగ్.. మళ్లీ మారిన ప్రభాస్ లైనప్
RGV: ఆర్జీవీకి బిగ్ షాక్.. 3 నెలల జైలు శిక్ష
Balakrishna: బాలయ్య పాట పాడితే.. ఎవరైనా చిందులేయాల్సిందే..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్ కామెంట్స్
Rashmika Mandanna: ఆ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుంది.. రష్మిక షాకింగ్ కామెంట్స్