లైఫ్‌లో ఏదీ శాశ్వతం కాదనేందుకు అసలైన ఉదాహరణగా నిలుస్తోంది ఓ యుకే మహిళ. చక్కని సంసారంతో పాటు ఊహించని విధంగా బ్రిటన్‌లో తొలి ఆన్‌లైన నేషనల్ లాటరీ గెలవడంతో ఆమె జీవితంలో సంబరం అంబరాన్ని అంటింది. అంతలోనే డబ్బంతా కోల్పోయి చివరకు భర్తకు కూడా దూరమైంది. ఒకప్పుడు విలాసవంతమైన జీవితాన్ని చవి చూసిన ఆమె నేడు అత్యంత సాధారణ జీవితం గడుపుతోంది.
పరిస్థితి ఎలాంటిదైనా తట్టుకుని నిలబడమే తనకు తెలిసిందని చెబుతున్న ఈ మహిళ పేరు లారా. ఆమె ఉండేది వెస్ట్‌యార్క్ షైర్‌లో. అది 2005. అప్పటికి లారా వయసు 30. ఆమెకు పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. ఆమె భర్త రాజర్ ఐటీ మేనేజర్‌గా చేస్తుండగా లారా స్కూల్ టీచర్‌గా పనిచేసేది. వారికి డబ్బు అంతగా లేకపోయినా జీవితం హ్యాపీగా సాగిపోయేది. అలాంటి సమయంలో వారి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. వారికి ఏకంగా రూ.20 కోట్ల లాటరీ తగిలింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఉన్నఫళంగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రూ.4.8 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాన్ని కొన్నారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడ్డారు. విదేశీ టూర్ల పేరిట భారీగా డబ్బులు ఖర్చు చేశారు. వ్యాపార రంగంలోకి ప్రవేశించేందుకు ఓ బ్యూటీ సెలూన్ కూడా కొన్నారు. సాఫీగా సాగిపోతున్నతరుణంలో 2010లో వారి ఇల్లు అగ్నిప్రమాదంలో బుగ్గి అయిపోయింది. రోజుల పాటు మంటల్లో పడి ఇల్లు తగలబడింది. చివరకు బూడిద కుప్పగా మారింది. ఉండటానికి ఇల్లు కూడా లేని దశకు చేరుకున్న వారు తమ సంతానంతో కలిసి చాలా రోజుల పాటు హోటళ్లల్లో తలదాచుకున్నారు. కొన్నాళ్ల పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఉన్నారు. చివరకు ఇల్లు నిర్మించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వీడి టాలెంట్ తగలడా.. వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??