Phani CH |
Updated on: Feb 12, 2025 | 5:17 PM
మీరు ఇంటి లోన్ తీసుకొని ఈఎంఐ చెల్లిస్తున్నారా? వాహనాల రుణాలపై వడ్డీ రేట్లు మీకు భారంగా మారాయా? మీలో ఎవరైనా బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని చిన్న పరిశ్రమలు నడుపుతున్నారా? మీ అందరికీ రిజర్వు బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చెల్లిస్తున్న వడ్డీ రేట్ల భారం కాస్త తగ్గుతుంది. ఎందుకంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించింది.
అంటే 25 శాతం బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు తగ్గుతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అవసరాలకు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకొని ఈఎంఐ చెల్లిస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇటీవల బడ్జెట్ నేపథ్యంలో ఈ ద్రవ్య సమీక్షపై అటు వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఇటు బ్యాంకర్లు, రుణగ్రహీతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్లుగానే రెపో రేటును పావు శాతం కోత పెట్టింది ఆర్బీఐ. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది. అలాగే రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటర్నెట్ కాదు.. డేంజర్ నెట్! ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటుతున్న సినిమా
TOP 9 ET News: రూ.73 కోట్ల తండేల్.. దంచికొడుతున్న చైతూ
రజినీకాంత్ సినిమాకే ఇలాంటి గతి పడితే ఎలా?
Raghavendra Rao: తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ
Daaku Maharaaj: దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్‌ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్