ఈ ఘటన తర్వాత సైఫ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సైఫ్ టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. హిందీ నటి షర్మిలా టాగోర్ దంపతుల కుమారుడు. 1991లో హిందీ నటి అమృతా సింగ్ ను వివాహాం చేసుకున్నారు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ జన్మించారు. ఆ తర్వాత 2004లో వీరిద్దరు విడాకులు తీసుకోగా.. 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. నివేదికల ప్రకారం సైఫ్ ఇప్పటివరకు రూ.1,180 కోట్లు సంపాదించారు. కాగా, సైఫ్ పూర్వీకులు పటౌడీ నవాబులు. వీరికి హర్యానాలో పటౌడీ ప్యాలెస్ ఉంది. 10 ఎకరాల్లో 150 గదులు, ఏడు పడక గదులు కలిగిన విశాలమైన ప్యాలస్ అది. దాని ధర రూ.800 కోట్లు. ముంబై, ఢిల్లీ, హర్యానా, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్న రూ.5000 కోట్ ఆస్తులకు అధిపతి. దీంతో ఇప్పుడు ఆయన నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం :
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?