షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. యువ స్పిన్నర్ అల్లా గజన్ఫర్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఆప్ఘన్ తొలి ముగ్గురు బ్యాటర్లు కేవలం 35 పరుగులకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ షాహిదీ 92 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మహ్మద్ నబీ 79 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లతో అఫ్గానిస్థాన్ 49.4 ఓవర్లలో 235 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌కు ఆలౌటైంది.
ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఇక 236 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు శుభారంభం లభించింది. ఓపెనర్ తన్జిద్ హసన్(3) ఆరంభంలోనే ఔటైనప్పటికీ.. సౌమ్య సర్కార్(33), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(47) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బంగ్లా నిర్ణీత 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పాడు అల్లా గజన్ఫర్.
ఇవి కూడా చదవండి
ఈ యువ స్పిన్నర్ వరుస వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ వెన్నెముకను విరగ్గొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ తన చివరి 8 వికెట్లు కేవలం 23 పరుగులకే కోల్పోయింది. దీంతో 143 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. అల్లా గజన్ఫర్ 6.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 26 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డేల్లో ఇదే అత్యుత్తమ గణాంకాలు. ఇంతకుముందు ఈ రికార్డు షకీబ్ అల్ హసన్ పేరిట ఉండేది. 2019లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ 29 పరుగులిచ్చి 5 పరుగులు చేశాడు.
ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా
అల్లా గజన్ఫర్ కేవలం 26 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అఫ్గానిస్థాన్ తరఫున రెండో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. 2017లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. 18 ఏళ్ల వయసులో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన నాలుగో పిన్న వయస్కుడైన బౌలర్‌గా నిలిచాడు. షార్జా పిచ్‌పై ఒకే మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్(7/30) అగ్రస్థానంలో నిలవగా, అల్లా గజంఫర్(26 పరుగులిచ్చి 6 వికెట్లు) రెండో స్థానంలో నిలిచాడు.
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..