ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా విగ్రహాన్ని తయారు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు ఈ యువ శిల్పి పెద్దిరెడ్డి రవీంద్ర.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగ ప్రయత్నం చేయకుండా విగ్రహాలు తయారు చేయడమే కుటుంబ వారసత్వంగా భావించి కొత్త టెక్నాలజీతో ఆధునిక పద్ధతిలో విగ్రహాలు తయారు చేస్తున్నాడు ఈ యువకుడు..
A Young Man Made The Ratan Tata Idol In The Dr Br Ambedkar Konaseema District
అంబేద్కర్ కోనసీమ జిల్లా గాడిలంక గ్రామం విగ్రహాలు తయారు చేయడంలో ప్రసిద్ధి గాంచింది. దేవతా మూర్తులు, స్వతంత్ర సమరయోధులు, ప్రముఖ దేశ నాయకులతో పాటు ఎందరో మహానుభావుల విగ్రహాలను తయారు చేసి అందరు మన్ననలు పొందిన గాడిలంక గ్రామ శిల్పులు నేడు వారసత్వంగా వస్తున్న విగ్రహాల తయారీ వృత్తిని వదిలి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ వివిధ రంగాల్లో స్థిర పడుతున్నారు.ఈ తరుణంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగ ప్రయత్నం చేయకుండా విగ్రహాలు తయారు చేయడమే కుటుంబ వారసత్వంగా భావించి కొత్త టెక్నాలజీతో ఆధునిక పద్ధతిలో విగ్రహాలు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు గాడిలంక యువకుడు..అతనే పెద్దిరెడ్డి రవీంద్ర..
ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా విగ్రహన్ని, ఆధునిక పద్దతిలో చిన్న సైజు అడుగు విగ్రహాల నుండి 100 అడుగుల విగ్రహాల వరకు తయారు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు ఈ యువ శిల్పి పెద్దిరెడ్డి రవీంద్ర.. ప్రపంచ దేశాలు మెచ్చుకున్న పారిశ్రామిక దిగ్గజం, వ్యాపారంలో విలువలు, దాతృత్వం కలిగి నిరాడంబర జీవితం గడిపిన రతన్ టాటా మన మధ్య భౌతికంగా లేకపోయినా భారత దేశ ప్రజలు విగ్రహ రూపంలో ఆయన గుర్తించుకోవాలని ఆయన విగ్రహం తయారు చేస్తున్నట్లు పెద్దిరెడ్డి రవీంద్ర తెలిపారు. ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు తయారు చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే రతన్ టాటా విగ్రహం తయారు చేసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు.