90వ దశకంలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అబ్బాస్. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో.. ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. మీర్జా అబ్బాస్ అలీ మే 21, 1975న కోల్‌కతాలో జన్మించారు. అతను ముంబైలో విద్యాబ్యాసం పూర్తి చేసిన అబ్బాస్.. మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత 1996లో కతిర్ దర్శకత్వం వహించిన కాదల్ దేశం (తెలుగులో ప్రేమదేశం) చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే హీరోగా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో అబ్బాస్ తోపాటు వినీత్ సైతం హీరోగా కనిపించారు. ఇందులో టబు కథానాయికగా నటించగా.. వడివేలు కీలకపాత్ర పోషించాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. చివరకు ఎవరి ప్రేమ గెలిచింది.. ? ఇద్దరి స్నేహితుల మధ్య ఏం జరిగిందనేది సినిమా. అప్పట్లో అబ్బాస్ యాక్టింగ్, లుక్స్, హెయిర్ స్టైల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.
1997లో, అబ్బాస్ సబాపతి దక్షిణ మూర్తి దర్శకత్వం వహించిన VIP చిత్రంలో నటుడు ప్రభుదేవాతో కలిసి నటించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు. 90’sలో అమ్మాయిల ఫేవరేట్ హీరో అతడు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు.. అతడు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాడు. దీంతో అబ్బాస్ క్రేజ్ నెమ్మదిగా తగ్గిపోయింది. అబ్బాస్ 2015 నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
కొన్నాళ్లుగా అతడు తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో నివసిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు అబ్బాస్. ఎప్పుడో ఒకసారి తన ఫ్యామిలీ విషయాలను నెటిజన్లతో పంచుకుంటున్నాడు. అలాగే ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన అబ్బాస్ ఓ తమిళ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ హీరో గురించి క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే. త్వరలోనే అబ్బాస్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడట.
దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు అబ్బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. విక్రమ్ వేద చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకులు పుష్కర్, గాయత్రి నిర్మించనున్న వెబ్ సిరీస్‌లో నటుడు అబ్బాస్ నటించనున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌కు దర్శకుడు సర్గుణం దర్శకత్వం వహించబోతున్నారని సినీ వర్గాల్లో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన