ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ . అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు. అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారంటూ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు
Allu Arjun
హీరో అల్లు అర్జున్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టి వెయ్యాలనీ సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మాజీఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హై కోర్టు నేడు తీర్పు ఇచ్చింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును హై కోర్టు కొట్టేసింది. అంతకు ముందు ఎఫ్ ఐ ఆర్ అధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చిన హై కోర్టు.. ఇప్పుడు కేసును కొట్టివేసింది.
ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ — అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు — అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారంటూ అల్లు అర్జున్‌పై ఫిర్యాదు — సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30 ఉల్లంఘించారని కంప్లైంట్ రావడంతో కేసు — కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్