డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చాలా మంది సెలబ్రెటీలు అవగాహనా వీడియోలను చేస్తున్న విషయం తెలిసిందే.. యాంటీ నార్కోటిక్ టీమ్ కోసం ఇప్పటికే సినిమా హీరోలు పలు వీడియోలు చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం వీడియో చేశారు. దీని పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ కు ఆయన అభినందనలు తెలిపారు. “డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం అని సీఎం తెలిపారు. ఈ కామెంట్స్ కు పలు యాష్ ట్యాగ్స్ కూడా జోడించారు.
ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ చిన్నది
కాగా రేవంత్ రెడ్డి పోస్ట్ కు అల్లు అర్జున్ రిప్లే ఇచ్చారు. డ్రగ్స్ నిర్ములనపై అవగాహనా కల్పిస్తూ బన్నీ చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. హైదరాబాద్ ను, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబరు 1908కు వెంటనే ఫోన్ చేయండి. వారు స్పందించింది బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం” అని అల్లు అర్జున్ వీడియో ద్వారా తెలిపారు.
అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా డిసెంబర్ 5ను ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప 2 పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను తారా స్థాయికి చేర్చింది. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..
Let’s unite to enactment the victims and enactment towards gathering a safer, healthier society.
Humbled to articulation this impactful inaugural by the Government of Telangana.@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tZ5Rkiw5Lg
— Allu Arjun (@alluarjun) November 28, 2024
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..