నా పేరు సూర్య షూటింగ్ కోసం గోవా వెళ్లానని.. అప్పుడే తన ప్రాణ స్నేహితుడు సందీప్ రామ్నేని కూడా అక్కడకు వచ్చాడని చెప్పిన బన్నీ.. తనకు ఏం కావాలని అడిగితే వైన్ లో ఒక బ్రాండ్ చెప్పారన్నాడు. తన కోసం తీసుకోవడానికే ఆ వైన్ షాపుకు వెళ్లినట్లు చెప్పాడు ఐకాన్ స్టార్. అయితే తన స్నేహితుడు అడిగిన బ్రాండ్ అక్కడ లేకపోవడంతో ఏమి కొనకుండానే వెనక్కి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఆవెంటనే తన స్నేహితుడు సందీప్ రామ్నేనిని అన్ స్టాపబుల్ స్టేజ్ పైకి తీసుకువచ్చాడు బన్నీ. తన ఫ్రెండ్ బాలయ్య వీరాభిమానని అని చెబుతూ పరిచయం చేశాడు. తనకు సందీప్ బ్రెస్ట్ ఫ్రెండ్ అని.. చిన్ననాటి నుంచి స్నేహితులమని.. వీడు లేకుండా నేనుండలేను అంటూ తన స్నేహితుడిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు అల్లు అర్జున్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.