ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఇండియన్ షేక్ చేసింది. ఏకంగా రూ. 18వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులను బ్రహ్మరధం పడుతున్నారు. పుష్ప రాజ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సినిమాలతో పాటు ఆయన ఫ్యామిలీకు కూడా కావాల్సినంత సమయం ఇస్తుంటారు. అల్లు అర్జున్ ఎంత పాపులర్ హీరోనో ఆయన పిల్లలు కూడా అంతే పాపులర్. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ సినిమాలోనూ నటించింది.
ఇది కూడా చదవండి : అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు హీటు పెంచే హాటీ.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
సమంత నటించిన శాకుంతలం సినిమాలో అర్హ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఈ చిన్నారులు చాలా యాక్టివ్ గా ఉంటారు. అర్హ, అయాన్ ఫోటోలు, వీడియోలను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు కూడా అర్హ, అయాన్ హాజరయ్యారు. తమ ముద్దుముద్దు మాటలతో ఈ చిన్నారులు ఆకట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
ఇదిలా ఉంటే అయాన్ ను బన్నీ అభిమానులు అయాన్ భాయ్, మోడల్ అంటూ సరదా పిలుస్తూ ఉంటారు. ఆ చిచ్చరపిడుగు చేసే అల్లరిని ఫన్నీగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. కాగా తాజాగా అల్లు అర్జున్ సతీమణి షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అల్లు శిరీష్ అర్హ, అయాన్ లతో కలిసి ఓ రీల్ చేశారు. పాతర్ పే పాతర్ మారేతో తో అంటూ ఓ స్లోగన్ చెప్తూ వీడియో చేశారు శిరీష్. ఈ వీడియోలో శిరీష్ తో పాటు అర్హ,అయాన్ తోపాటు మరో చిన్నారి కూడా ఉంది. ఈ వీడియోలో చివరిలో అయాన్ భాయ్ అంటూ వచ్చినప్పుడు బన్నీ కొడుకు ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి