Amaravathi: సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ త్వరలోనే శ్రీకారంచుట్టనుంది. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే సచివాలయ టవర్లలో నీటి తోడివేత తుది దశకు చేరుకోవడంతో పీఎంసీలను నియమించనుంది..
ఏపీ రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రుణం విషయంలో హడ్కో సానుకూలంగా స్పందిండంతో అమరావతి పనులు వేగవంతం అవుతాయన్నారు మంత్రి నారాయణ. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు, మరికొన్ని సంస్థలు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని అమరావతికి సంబంధించిన రుణంపై హడ్కో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేయాలని హడ్కో నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం తమ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సంప్రదింపులకు హడ్కో సానుకూలంగా స్పందించిందన్నారు. హడ్కో నిర్ణయంతో రాజధాని అమరావతి పనులు వేగవంతమవుతాయన్నారు.
సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ త్వరలోనే శ్రీకారంచుట్టనుంది. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే సచివాలయ టవర్లలో నీటి తోడివేత తుది దశకు చేరుకోవడంతో పీఎంసీలను నియమించనుంది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కీలక పనులు చేపట్టేందుకు ఈ పీఎంసీలు అంచనాలు రూపొందించనున్నాయి. వాటి ప్రకారం టెండర్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేశాక క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ కూడా పీఎంసీలే నిర్వహించాల్సి ఉంటుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి