అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గుంతకల్ RDO కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో నాగభూషణం తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. RDO కార్యాలయం అనుకున్నారో లేక.. తన స్వంత ఇళ్లు అనుకున్నారో తెలియదు కానీ.. తాను విధులు నిర్వహించే ఛాంబర్‌లోనే సంసారం పెట్టేంత పనిచేశారు. ఛాంబర్‌లో మంచం ఏర్పాటు చేసుకొని బెడ్ రూమ్‌గా వాడుకుంటున్నారు ఏవో. ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే పడకేస్తున్నాడు. ఈవ్యవహారం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇంతేకాదు ఆఫీస్ లోని కింది స్థాయి స్టాప్‌తో ఏవో నాగభూషణం ఛాంబర్ శుభ్రం చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
దానికి సంబంధించిన విజువల్స్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వహిస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా తాను ఉన్నంతవరకే ఇక్కడ ఉండాలంటూ హూకూం జారీ చేస్తున్నాడు. అయితే ఈ వ్యవహారం ఆర్డీవోకు తెలిసే జరుగుతుందా? లేక తెలియలేదా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకవేళ ఏవో చేష్టలు తెలిసి కూడా చూసి చూడనట్లు ఆర్డీవో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి..
ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకోవడంపై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ఏవో నాగభూషణంపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని.. ఇంత జరుగుతున్న నిర్లక్ష్యంగా ఉన్న ఆర్డీవోపై కూడా యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..