హెల్మెట్ పెట్టుకోండి..సీటు బెల్ట్ పెట్టుకోండి.. మద్యం సేవించి వాహనాలు నడపకండి అని ప్రభుత్వాలు..పోలీసులు చెవిలో జోరీగలా చెబుతూనే ఉన్నా.. మనవాళ్లు పట్టించుకోరు. ఆనక ప్రమాదం బారిన పడితేకానీ వారి పోలీసుల రొద విలువ తెలియదు. తనిఖీల్లో పట్టుబడినా ఫైన్ కట్టేసి..అక్కడే దులిపేసుకొని మళ్లీ అదేపని చేస్తుంటారు. ఇలా చాలామంది చేస్తుంటారు. వారి వెనుక వారి కుటుంబాలు ఉన్నాయిని తాము ప్రమాదాల్లో పడితే కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించారు. తన భర్తకు యాక్సిడెంట్ అయి, గాయాలతో పయటడపడంతో ఓ టీచర్ ఇలాంటి పరిస్థితి మళ్లీ తనకు రాకూడదని ఇస్మార్ట్ ఆలోచన చేసింది. అద్భుతమైన హెల్మెట్ తయారుచేసింది. ఆ హెల్మెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం పదండి..
Teacher Good Innovation
Nalluri Naresh | Edited By: Ram Naramaneni
Updated on: Feb 08, 2025 | 12:05 PM
ఈ హెల్మెట్ వాహనదారుడ్ని ఎలా అలర్ట్ చేస్తుందంటే.. హెల్మెట్ పెట్టుకోనిదే ఆ బైక్ స్టార్ట్ కాదు.. అలాగే మద్యం సేవించి డ్రైవ్ చేయాలని ప్రయత్నించినా బైక్ స్టార్ట్ అవదు. అంతేకాదు.. ఎప్పుడైనా వాహనదారుడికి ప్రమాదం జరిగితే వెంటనే సహాయం కోసం పోలీసులకు మెసేజ్ వెళ్తుంది. ఈవిధంగా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ హెల్మెట్‌ను తయారు చేసారు ఈ టీచర్. టెక్నాలజీని చక్కగా ఉపయోగించారు టీచర్ విజయ భార్గవి. అవును శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని రేకులకుంట గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు విజయ భార్గవి. తన భర్త హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతూ యాక్సిడెంట్‌కు గురై చిన్న గాయాలతో బయటపడటంతో తనలో ఈ ఆలోచన వచ్చిందని భార్గవి తెలిపారు.
తనకు తెలిసిన టెక్నాలజీతోనే తన భర్త ఉపయోగించే హెల్మెట్‌కు ఈ ఏర్పాటు చేశానని, ప్రమాదానికి గురైతే సమీప పోలీస్ స్టెషన్ కు మెసేజ్ వెళ్ళే విధంగా బైక్, హెల్మెట్ ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఈ స్మార్ట్ హెల్మెట్ తయారు చేశానంటున్నారు ఉపాధ్యాయిని విజయభార్గవి. ఇలాంటి హెల్మెట్స్ అందరికి అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తే రోడ్డు ప్రమాదాలు కొంతవరకైనా నివారించవచ్చని, ప్రమాదాలకు గురైనవారికి తక్షణ సహాయం అందుతుందని అంటున్నారు భార్గవి. విద్యార్థులకు ఈ విధంగా పాఠాలు చెబుతూ..ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తే వారిలో సృజనాత్మకత పెరుగుతుందని వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి