విశాఖలో ఆసియా గ్యాస్ విస్తరణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పడవలతో ప్రదర్శన చేశారు. పర్యావరణ పరిరక్షణ సంస్థలైన సమతతో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. ఎందుకో తెలుసా?
Protest On A Boat With Placards In Visakhapatnam
ఆసియా గ్యాస్ విస్తరణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖలో పడవలతో ప్రదర్శన చేశారు. నడి సముద్రంలో పడవలతో వెళ్లి గ్యాస్ ప్రాజెక్టులు వద్దు అని సముద్రంలో ప్లాస్టిక్ నివారించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఆసియా గ్యాస్ విస్తరణ వ్యతిరేక దినోత్సవాన్ని సందర్భంగా విశాఖ జిల్లా మత్స్యకారులు సముద్రంలో పడవలపై ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సంస్థలైన సమతతో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మత్స్యకారులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పడవలపై ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని సముద్రంలో పడవల ర్యాలీ నిర్వహించారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల సముద్రంలో ప్లాస్టిక్ గణనీయంగా పెరుగుతోందని ప్రదర్శనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ నియంత్రణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌తో సముద్రం కలుషితమవ్వడమే కాకుండా సముద్ర జీవరాసులకు జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటితో పాటు సముద్రాల్లో వెలికితీస్తున్న గ్యాస్ విస్తరణ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భూతాపం ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని.. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు, చమురు, గ్యాస్ ఉత్పత్తిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.