ఆస్కార్ అవార్డ్ అందుకున్న రెహమాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఏ విషయాన్నీ ఎప్పుడూ బయటకు చెప్పరు. అలాగే అతడి కుటుంబం కూడా మీడియా ముందుకు రావడం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు అనుహ్యంగా రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు అతడి భార్య సైరాబాను ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. అటు డివోర్స్ ప్రకటనపై రెహమాన్ భావోద్వేగంతో ఓ ప్రకటన విడుద చేశారు. దీంతో ఇప్పుడు రెహమాన్ లైఫ్ గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే అసలు రెహ్మాన్ ఇస్లాంలోకి ఎందుకు మారారో తెలుసుకునేందుకు గూగుల్ చేస్తున్నారు.
తనకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నారు రెహమాన్. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో చదువును మధ్యలోనే వదిలేసిన రెహమాన్.. 11 ఏళ్ల వయసులోనే పియానో, కీబోర్డు ప్లేయర్ గా ఇళయరాజా, రమేశ్ నాయుడు, రాజ్ కోటీల వద్ద పనిచేశాడు. అయితే రెహమాన్ కుటుంబం 1989లో ఇస్లాం మతంలోకి మారింది. అప్పుడున్న వారి పరిస్థితుల కారణంగా.. వారి నమ్మకాలకు అనుగుణంగా… రెహ్మాన్ ఫ్యామిలీ మతం మార్చుకుంది. అప్పటి నుంచి దిలీప్ కుమార్ పేరు కాస్త రెహమాన్ గా చేంజ్ అయింది. రోజా సినిమా విడుదలకు ముందు రెహమాన్ కుటుంబం ఇస్లాం మతాన్ని స్వీకరించింది. దీంతో చివరి నిమిషంలో రోజా సినిమాలో అతడి పేరును రెహమాన్ గా మార్చాలని అతడి తల్లి కోరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.