ఇంగువ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇంగువ దాదాపు అందరికీ తెలుసు. అనేక రకాల వంటల్లో ఇంగువను ఉపయోగిస్తారు. ముఖ్యంగా సాంబార్, పప్పు తాళింపులో ఇంగువ వేస్తే ఆహా.. ఆ రుచి, సువాసనే వేరు. వంటలకు కూడా రుచి వస్తుంది. ఇంగువను కేవలం వంటల రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఇంగువతో వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. పెద్దలు ఏం చేసినా ఆలోచించే చేస్తారు. పురాతన కాలం నుంచి కూడా వంటల్లో ఇంగువను ఉపయోగించే వారు. ఇంగువను రెగ్యులర్‌గా వంటల్లో ఉపయోగించడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడొచ్చు. ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. రోజూ ఇంగువను తీసుకుంటే ఏం జరుగుతుంతో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్వాసకోశ సమస్యలు మాయం:
ఇంగువ తీసుకోవడం వల్ల శ్వాస కోశ సమస్యలను తగ్గించుకోవచ్చు. కఫం, ఆస్తమా, దగ్గు, జలుబు వంటి వంటి సమస్యలు ఉన్నవారు ఇంగువను తీసుకుంటే కంట్రోల్ అవుతాయి. కఫాన్ని తొలగించాలంటే గోరు వెచ్చని నీటిలో ఇంగువ కలఅిపి తీసుకోవాలి. దీని వల్ల కఫం బయటకు పోతుంది. మంచి ఉశమనం లభిస్తుంది.
నెలసరి సమస్యలు:
ఇంగువను రెగ్యులర్‌గా తీసుకుంటే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంుగవలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తిమ్మిరి, నొప్పిని తగ్గించడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది.
ఇవి కూడా చదవండి
గుండె సమస్యలు మాయం:
రెగ్యులర్‌గా ఇంగువ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంగువ.. రక్త సరఫరా సరిగా జరిగేలా చేస్తుంది. రక్తం గడ్డలు కట్టకుండా ఆపుతుంది. అలాగే బీపీని అదుపులో ఉంచుతుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు రాకుండా ఆపుతుంది. కాబట్టి ఇంగువను తీసుకుంటే గుండె సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
జీర్ణ సమస్యలు చెక్:
ఇంగువ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మలబద్ధకం, గ్యాస్, కడుపులో అజీర్తి, కడుపులో ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఇంగువ తీసుకుంటే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.