Border Gavaskar Trophy 1st Test Day 1: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం తొలిరోజు మ్యాచ్ రెండో సెషన్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. నితీష్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా ఔటయ్యాడు. అతను జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి చిక్కాడు. హర్షిత్ రాణా (7 పరుగులు), విరాట్ కోహ్లి (5 పరుగులు), దేవదత్ పడిక్కల్ (0) వికెట్లను కూడా తీశాడు.
37 పరుగుల వద్ద రిషబ్ పంత్ అవుటయ్యాడు. అతనుపాట్ కమిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. వాషింగ్టన్ సుందర్ (4 పరుగులు), ధ్రువ్ జురెల్ (11 పరుగులు), కేఎల్ రాహుల్ (26 పరుగులు), యశస్వి జైస్వాల్ (0) పెద్దగా ఆకట్టుకోలేదు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్.
ఇవి కూడా చదవండి
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..