భారతదేశంలో ఆటో కంపెనీలు సీఎన్‌జీ వైపు దృష్టి సారిస్తున్నాయి. బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేయడంతో ఆ రంగంలో తమ ఉనికిని చాటుకునేందుకు కొన్ని కంపెనీలు సీఎన్‌జీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ ఆటో ఎక్స్‌పో 2025లో ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ మోడల్ కాన్సెప్ట్ మోడల్‌గా పరిచయం చేసింది. ప్రజా స్పందనకు అనుగుణంగా త్వరలోనే ఈ స్కూటర్ ఉత్పత్తిని కంపెనీ ప్రారంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ మోడల్ కూడా పెట్రోల్‌తో నడుస్తుంది.
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ నడిచే విధంగానే ఈ స్కూటర్ కూడా ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే ఈ సీఎన్‌జీ స్కూటర్ డిజైన్ 125 సీసీ పెట్రోల్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ స్కూటర్‌లో 1.4 కిలోల సీఎన్‌జీ ట్యాంక్‌తో పాటు 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఇటీవల వెల్లడైన నివేదికల ప్రకారం ఈ సీఎన్‌జీ స్కూటర్ ఒక కిలో సీఎన్‌జీకు 84 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని తెలస్తుంది. ఓ సారి ఫుల్ ట్యాంక్ చేయించుకన్నాక ఈ స్కూటర్‌తో మొత్తం 226 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు ఈ స్కూటర్‌లో ఓబీడీ2బీ కంప్లైంట్ ఇంజిన్ ఉంది. అందువల్ల ఈ స్కూటర్ 5.3 బీహెచ్‌పీ శక్తిని, 9.4 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టీవీఎస్ జూపిటర్ పెట్రోల్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 88,174 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 99,015 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ నేపథ్యంలో సీఎన్‌జీ స్కూటర్ ధర రూ. 90 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 99 వేల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సీఎన్‌జీ స్కూటర్‌లో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి కొన్ని స్మార్ట్ ఫీచర్లతో రానుంది. స్టాండ్ కట్ ఆఫ్ సేఫ్టీ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. స్కూటర్‌లో సీఎన్‌జీ ట్యాంక్ కార్ణంగా బూట్ స్పేస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి