డోనట్స్ అంటే ఈ జనరేషన్ పిల్లలకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇవి తియ్యగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో ఎప్పుడూ చేసే స్నాక్స్ కాకుండా ఇలా వెరైటీగా కూడా చేయండి. పిల్లలకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ డోనట్స్‌ని మనం ఫ్రూట్స్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి చేయడం కూడా చాలా సులువు. చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. ఈ డోనట్స్‌ని మనం అరటి పండ్లతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ బనానా డోనట్స్‌ని ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బనానా డోనట్స్‌కి కావాల్సిన పదార్థాలు:
అరటి పండ్లు, పంచదార, కోడిగుడ్లు, గోధుమ పిండి, ఉప్పు, వెనీలా ఎసెన్స్, బటర్, బేకింగ్ సోడా.
ఇవి కూడా చదవండి
బనానా డోనట్స్ తయారీ విధానం:
ముందుగా ఓ గిన్నెలోకి అరటి పండ్లను తీసుకోండి. మరీ పచ్చివి కాకుండా కాస్త మగ్గినవి అయితే రుచిగా ఉంటాయి. ఇందులో జల్లించిన గోధుమ పిండి, బేకింగ్ సోడా, బటర్, వెనీలా ఎసెన్స్, పంచదార పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే డోనట్స్ అనేవి అంత ఫ్లఫ్ఫీగా వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని డోనట్ మేకర్‌లో పెట్టి.. ఓ పది నిమిషాలు స్వీచ్ ఆన్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన డోనట్స్ సిద్ధం. వీటిపైన మనకు నచ్చినట్టుగా గార్నిష్ కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయి.