చలికాలంలో చర్మం పొడిగా మారి చేతులు, శరీరభాగాలు నల్లగా కనిపించడం సాధారణం. దీని వెనుక చలికి స్కిన్ ఎక్స్‌పోజ్ అవ్వడం, సరైన కేర్ తీసుకోకపోవడం వంటి కారణాలు ఉంటాయి. మీ చర్మానికి మళ్లీ కాంతి చేకూర్చేందుకు కర్పూరంతో ఓ స్పెషల్ ప్యాక్ ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ రాసిన తర్వాత చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. దానిని ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
కర్పూరం – 1 కాఫీ పొడి – 2 టీ స్పూన్లు నిమ్మరసం – ½ టీ స్పూన్ కొబ్బరినూనె – 1 టీ స్పూన్ షాంపూ – 1 టీ స్పూన్ పంచదార – ½ టీ స్పూన్
ప్యాక్ తయారీ విధానం
ఒక గిన్నెలో కర్పూరం, కాఫీ పొడి, పంచదారను వేసి కలపండి. ఆ గిన్నెలోనే నిమ్మరసం, కొబ్బరినూనె, షాంపూను జత చేసి బాగా కలియబెట్టండి. ఇది గట్టిగా కాకుండా స్క్రబ్ చేయడానికి సులభమైన పేస్ట్ మాదిరిగా ఉండాలి. ఈ ప్యాక్‌ని చేతులు, కాళ్లపై అప్లై చేయండి.
ఉపయోగం విధానం
ఈ ప్యాక్‌ని చేతులపై రాసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉంచండి. ఆపై తడిగా ఉన్న చేతులతో 5 నిమిషాల పాటు స్క్రబ్ చేయండి. చివరిగా గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ని వాడడం వల్ల టాన్ తగ్గి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
కర్పూరం వల్ల లాభాలు
కర్పూరంలో క్రిమినాశక లక్షణాలు, యాంటీ బయోటిక్ గుణాలు ఉండటంతో చర్మం సంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గించడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పూజల్లో వాడే ఈ కర్పూరం అందం కోసం ఉపయోగపడుతుందనేది చాలా మందికి తెలియని విషయం. ఈ డీ ట్యాన్ ప్యాక్ కేవలం చేతులకే కాదు, కాళ్లు, మెడ వంటి నల్లగా కనిపించే శరీర భాగాలకు కూడా ఉపయోగించవచ్చు. అయితే స్క్రబ్ చేయడంలో మరీ ఎక్కువ శక్తి ఉపయోగించకుండా మృదువుగా చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.
కొబ్బరి నూనెతో ప్రత్యేక ఫలితాలు
కొబ్బరినూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది. పొడి పెదాలకు లిప్‌బామ్‌లా వాడితే అవి మృదువుగా మారతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)