జీవితంలో ఉన్నత స్థాయి ఎదగాలని, వ్యాపారాల్లో రాణించి విజయకేతనం ఎగురవేయాలని, డబ్బు బాగా సంపాదించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. వాటిని నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. కానీ కొందరు మాత్రమే తాము అనుకున్నలక్ష్యాన్ని చేరుకుంటారు. మిగిలిన వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. క్రమశిక్షణ, ఆలోచన, కష్టపడే మనస్తత్వమే వారిని విజేతలుగా నిలుపుతాయి. అలాంటి వారిలో వారెన్ బఫెట్, బిల్ గేట్స్, ఎలోన్ మస్క్ ముఖ్యులు.
Indian Money
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బెర్క్ షైర్ హాత్వే సీఈవో వారెన్ బఫెట్ ప్రపంచంలో టాప్ టెన్ ధనవంతుల జాబితాలో కొనసాగుతున్నారు. వీరందరూ వేర్వేరు వ్యాపారాలు చేస్తూ, వివిధ నియమాలకు కట్టుబడి ఉన్నారు. తామున్న రంగంలో విజయ శిఖరాలకు చేరారు. ఈ ముగ్గురి జీవితాలను గమనిస్తే కొన్ని లక్షణాలను కామన్ గా ఉంటాయి. క్రిస్టోఫర్ గ్రోవ్ అనే రచయిత తన ది ఫిలాసఫీ ఆన్ సక్సెస్ అనే పుస్తకంలో కొన్ని ముఖ్య అంశాలను వెల్లడించాడు.
దీర్ఘకాలిక లక్ష్యాలు
- వారెన్ బఫెట్ ప్రపంచంలో గొప్ప పెట్టుబడి దారుడు. ఒక కంపెనీ పదేళ్ల తర్వాత ఏస్థాయిలో ఉంటుందో అంచనా వేయగలడు. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఆయన ముందుకు సాగుతాడు.
- బిల్ గేట్స్ తన జీవిత ప్రారంభంలో ప్రతి ఇంటికీ తన కంప్యూటర్ ను తీసుకెళ్లాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు తెచ్చి, మైక్రోసాఫ్ట్ కంపెనీతో సాఫ్ట్ వేర్ రంగంలో రారాజుగా కొనసాగుతున్నాడు.
- టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తన లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమిస్తాడు. అతడి ఆలోచన భూమిని దాటి ముందుకు పోయింది. స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు మార్స్ గ్రహాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.
రిస్క్ కు సిద్దపడడం
- తరచూ మార్పులకు లోనయ్యే వ్యాపారాలపై వారన్ బఫెట్ జాగ్రత్తగా ఉన్నాడు. రిస్క్ ను లెక్కించే మూల్యాంకన లేనప్పటికీ, రిస్క్ కు వ్యతిరేకంగా రివార్డును లెక్కిస్తామని అనేవాడు.
- జీవితంలో ఏదైనా సాధించాలంటే రిస్క్ అవసరమని బిల్ గేట్స్ అభిప్రాయం. కష్టమైన పనిని సులువుగా చేయడానికి మార్గాలను కనుగొనాలని ఆయన చెబుతూ ఉంటారు.
- రిస్క్ తీసుకోవడానికి ఎలోన్ మస్క్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాడు. దానిలో అతడు గేమ్ చేంజర్ గా పేరుపొందాడు.
వైఫల్యాల నుంచి నేర్చుకోవడం
- బఫెట్ తన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉంటాడు. వాటినే విజయానికి మెట్లుగా మార్చుకుంటాడు. తన వాటాదారులతో కూడా ఈ విషయంపైనే చర్చిస్తాడు.
- వైఫల్యం చెప్పే పాఠాలు చాలా గొప్పవని బిల్ గేట్స్ అభిప్రాయం. ఆయన మొదట్లో ట్రాప్ ఓ డేటా అనే కంపెనీని స్నేహితుడితో కలిసి ప్రారంభించాడు. కానీ అది పెద్దగా విజయం సాధించలేదు.
- ఎలోన్ మస్క్ జీవితంలో కూడా వైఫల్యాలు ఉన్నాయి. స్పేస్ ఎక్స్ రాకెట్ వైఫల్యం, టెస్లా ప్రారంభ పోరాటాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాటిని పట్టుదలతో అధిగమించి విజయానికి చేరువయ్యాడు.
నిరంతర అభ్యాసం
- వారెన్ బఫెట్ విజయం వెనుక అతడి నిరంతర అభ్యాసం కీలకంగా ఉంటుంది. ప్రతి విజయాన్ని అధ్యయనం చేయడం ద్వారా పెట్టుబడి నిర్ణయాలను సక్రమంగా తీసుకునే అవకాశం లభించింది.
- బిల్ గేట్స్ కు పఠనాసక్తి ఎక్కువ. దీని ద్వారా వివిధ విషయాలపై అవగాహన కలిగింది.
- ఎలోన్ మస్ కూడా మంచి పాఠకుడు, అభ్యాసకుడు. రాకెట్ సైన్స్ నుంచి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వరకూ వివిధ విషయాలపై పట్టు సాధించాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..