దిన ఫలాలు (జనవరి 22, 2025): మేష రాశి వారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాముంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు, నిరుద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి తప్పకుండా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
లాభ స్థానంలో శని, శుక్రుల కారణంగా ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. దశమ స్థానంలో రవి కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ధన స్థానంలో గురువు కారణంగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు తప్ప కుండా సఫలమవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
దశమ స్థానంలో శని, శుక్రుల యుతి కారణంగా ఉద్యోగంలో ఒక వెలుగు వెలుగుతారు. అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగించడంతో పాటు, ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి. భాగ్య స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. తండ్రి వైపు నంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
దశమ స్థానంలో రాహు సంచారం వల్ల పదోన్నతికి తప్పకుండా అవకాశం ఉంది. భాగ్య స్థానంలో శుక్ర, శని సంచారం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. రాశ్యధిపతి బుధుడు సప్తమంలో ఉన్నందువల్ల అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభ స్థానంలో గురువు సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అష్టమ శని వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆశించిన ప్రతిఫలం లేదా గుర్తింపు లభిస్తుంది. సప్తమ స్థానంలో రవి వల్ల ప్రభుత్వ ఉద్యోగితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా అనుకూలిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అధికారులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. అయితే, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. దశమంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యయ స్థానంలో వక్ర కుజుడి వల్ల అనవసర పరిచయాలు, వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. భాగ్య స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాలలో కూడా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆరవ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమ స్యల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడు, ఈ రాశికి అత్యంత శుభుడైన శని పంచమ స్థానంలో కలవడం వల్ల ఉద్యోగంలో రాజయోగం పడుతుంది. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. దశమ స్థానంలో కుజ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, అష్టమ గురువు కారణంగా వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవు తుంది. పెళ్లి, ఉద్యోగం, ఆదాయ ప్రయత్నాల్లో విజయాలు వరిస్తాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది కానీ, పని భారం బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సమస్యలు, అపార్థాలు పరిష్కారమై, సయోధ్య వృద్ధి చెందుతుంది. ధన స్థానంలో బుధ గ్రహ సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఈ రాశిలో బుధుడు, ధన స్థానంలో రవి, తృతీయ స్థానంలో శని, శుక్రుల సంచారం వల్ల పట్టిం దల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో గుర్తింపు లభించడం, డిమాండ్ పెరగడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవ కాశాలు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రాశ్య ధిపతి గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక లావాదేవీలకు బాగా దూరంగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఈ రాశిలో రవి సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అధికారుల నుంచి సానుకూ లతలు పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. తండ్రి వైపు నుంచి సహాయం లభించే అవకాశం ఉంది. ధన స్థానంలో శుక్ర, శనుల సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశిలో శని, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ధన స్థానంలో రాహువు సంచా రం వల్ల ఆదాయం పెరుగుతుంది కానీ, అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. లాభ స్థానంలో బుధ సంచారం వల్ల ప్రముఖులతో పరిచ యాలు పెరగడం, రావలసిన సొమ్ము చేతికి అందడం, గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశిలో రాహువు సంచారం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం బాగా తగ్గుతుంది. రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశిం చిన ఫలితాలనిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఏలి న్నాటి శని కారణంగా ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఎక్కువగా కలుగుతాయి.