జార్ఖండ్, జనవరి 22: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జార్ఖంగ్‌లోని ప్రజ్ఞాన్ యూనివర్సిటీని యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సీల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. యూజీసీ యాక్ట్ 1956 సెక్షన్ 2(0) ప్రకారం ఈ మేరకు ప్రజ్ఞాన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ పేరును తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వం యూనివర్సిటీ స్థాపన చట్టాన్ని రద్దు చేయడంతోపాటు పలు నిబంధనలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
జార్ఖండ్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గతేడాది మార్చిలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రజ్ఞాన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ చట్టం 2016 ప్రకారం ప్రజ్ఞాన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ స్థాపించబడింది. 2016 ఆగస్టు 3న యూజీసీ జాబితాలో చేరింది. అయితే ప్రజ్ఞాన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ యాక్ట్ 2016’ని 2024లో ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రిజల్యూషన్ ప్రకారం, ప్రజ్ఞాన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ 2016 సంవత్సరంలో స్థాపించిన తర్వాత కూడా ఉనికిలోకి రాలేదు. అక్కడ బోధన జరుగుతున్నట్లు ఎలాంటి ఆధారాలు యూజీసీకి సమర్పించలేదు. పైగా యూజీసీ పంపిన టెలిఫోన్ కాల్‌లు, ఇమెయిల్‌లకు యూనివర్సిటీ స్పందించలేదు. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వ హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ మార్చి 20, 2024న జార్ఖండ్ గెజిట్‌లో.. ప్రజ్ఞాన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ యాక్ట్, 2016ను రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. 2016లో విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి విద్యా కార్యకలాపాలను ప్రారంభించడంలో విఫలమైందని తీర్మానంలో హైలైట్ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో UGC చట్టంలోని సెక్షన్ 2(f) ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీల జాబితా నుంచి యూజీసీ అధికారికంగా ప్రజ్ఞాన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని తొలగించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.