ఒక బడా సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలాఆ రివ్యూల పేరుతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. తొలి షోనే సినిమా చూసేసి సినిమాలో ఏది ప్లేస్, ఏది మైనస్ అంటూ విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కొందరు. అయితే అందులో కొంతమంది జన్యున్ గా రివ్యూలు ఇస్తుంటే.. మరికొంతమంది మాత్రం కావాలనే కొన్ని సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వామని తనకు కొంతమంది డబ్బులు ఇచ్చారు అని చెప్పి షాక్ ఇచ్చాడు. పెద్ద సినిమా ఏది విడుదలైన చాలా మంది తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ లో సినిమా పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాల పై రివ్యూలు భారీ ప్రభావం చూపకపోయినా.. ఎంతో కొంత ఎఫెక్ట్ మాత్రం చూపిస్తాయి. రివ్యూలు చదివి, విని సినిమాలు వెళ్లే వారు, వెళ్లని వారు చాలా మందే ఉన్నారు.
ఇది కూడా చదవండి :స్టార్ హీరోయిన్ బాత్రూమ్ వీడియో లీక్.. అసలు విషయం తెలిసి అభిమానులు షాక్
కాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావడం.. పైగా దాదాపు ఆరేళ్ళ తర్వాత తారక్ సోలోగా వచ్చిన మూవీ అవ్వడంతో దేవర సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు వసూళ్లను కూడా భారీగానే రాబట్టింది. అయితే ఈ మూవీకి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని కొంతమంది తనకు డబ్బులు ఇచ్చారని చెప్పుకొచ్చాడు యూట్యూబర్ పూలచొక్కా నవీన్.
ఇది కూడా చదవండి :బాలయ్య విలన్ కూతుర్ని చూశారా..! అందాలతో దుమ్మురేపిన దునియా విజయ్ పుత్రిక
పూలచొక్కా నవీన్ ఇతని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సినిమా రివ్యూలు ఇస్తూ.. వాటికి రెండు టమాటాలు, మూడు టమాటాలు అంటూ రేటింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఇతన్ని ఫాలో అయ్యే వారు చాలా మందే ఉన్నారు. ఓ సందర్భంలో నవీన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని కొంతమంది తనకు డబ్బులు ఇచ్చారని చెప్పాడు. దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని ఓ హీరో పీఆర్వో వచ్చి నాకు రూ. 10 వేలు ఇచ్చాడు. కానీ సినిమా ఎలా ఉంటే అలానే రివ్యూ ఇస్తానని నచ్చితే నచ్చిందని, బాలేకపోతే బాగోలేదు అని చెప్తా … కలవని నెగిటివ్ రివ్యూ ఇస్తే నా క్రెడిబిలిటీ పోతుందని ఆ ఆఫర్ ను ఒప్పుకోలేదు అని తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.