కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో బీమా పరిశ్రమ అనేక రకాల తగ్గింపులను కోరుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పింఛనుదారులపై ద్వంద్వ పన్నును నిలిపివేయడంతో పాటు బీమాపై జీఎస్టీను తగ్గించడం లేదా తొలగించడం వంటి కీలక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఆరోగ్య పాలసీల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బీమా సవరణల బిల్లును ఖరారు చేయాలని స్పష్టం చేస్తున్నారు. యాన్యుటీ ఉత్పత్తులను కొనుగోలు చేసే పెన్షనర్లకు పన్ను రాయితీని బడ్జెట్‌లో ప్రస్తావించవచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం పెన్షనర్ తన పెన్షన్‌ను ఉపసంహరించుకునేటప్పుడు ద్వంద్వ పన్నును మినహాయిస్తున్నారు. పెన్షన్ ఫండ్‌లతో కొనుగోలు చేసిన యాన్యుటీ ఉత్పత్తిని వెనక్కి తీసుకునేటప్పుడు మళ్లీ పన్ను విధిస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని సరి చేయాలని బీమా పరిశ్రమ ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని కోరుతుంది. ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న బీమా సవరణ బిల్లుకు కూడా పరిష్కారం చూపాలని కోరుతున్నారు. బలహీనమైన సాల్వెన్సీ నిష్పత్తులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ-ఆధారిత సాధారణ బీమా సంస్థలకు రీక్యాపిటలైజేషన్ కోసం బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తక్కువ రేటుతో పాలసీల కోసం బీమా వ్యాప్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అంచే వేస్తున్నారు.
ఆరోగ్య బీమా పరిధిని విస్తరించేందుకు ప్రోత్సాహకాల అవసరం చాలా ఉందని మరికొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య బీమా వైపు మళ్లించడానికి ప్రభుత్వ చర్యలు కీలకమని భావిస్తున్నారు. పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో ఆరోగ్య బీమా రంగం గత మూడేళ్లుగా వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని, ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే మరింత వేగంగా దూసుకెళ్తుందని వివరిస్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, అధిక మొత్తం బీమా కవరేజీ అవసరం ఉన్నందున ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద పరిమితులను వ్యక్తులందరికీ రూ. 50,000, సీనియర్ సిటిజన్‌లకు రూ. 1 లక్షకు పెంచడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
2047 నాటికి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే నినాదాన్ని సాధించడంతో ప్రభుత్వ చర్యలు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో కొత్త వృద్ధిని నడపడానికి తక్షణ విధాన జోక్యం కోసం పిలుపునిచ్చారు. ఆరోగ్య బీమాపై జీఎస్‌టీని తగ్గించడం వల్ల మరింత సరసమైన ధర లభిస్తుందని, బీమా కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు పన్ను మినహాయింపులను పెంచడంతోపాటు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను హేతుబద్ధీకరించడం సంభావ్య పరిష్కారాలుగా ఉంటాయని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి