Best Mileage Cars: బడ్జెట్లో కారు దొరకడంతో పాటు, అది ఇచ్చే మైలేజ్ కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో మిడిల్ క్లాస్‌కి మోస్ట్ లైక్డ్ వెహికల్స్ గా ఏడు మోడల్స్ కనిపిస్తున్నాయి..
ఇండియాలో హై క్లాస్, లగ్జరీ, ఫైవ్ స్టార్ సేఫ్టీ ఉన్న వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. మిడిల్ క్లాస్ మైలేజ్ కార్లకు కూడా అంతకుమించి సేల్స్ కనిపిస్తున్నాయి. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలన్న, సొంత ఊర్లకు ప్రయాణం చేయాలన్న ఖచ్చితంగా ఓ కారు ఉండాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. ఇందుకు బడ్జెట్‌లో కారు దొరకడంతో పాటు, అది ఇచ్చే మైలేజ్ కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో మిడిల్ క్లాస్‌కి మోస్ట్ లైక్డ్ వెహికల్స్ గా ఏడు మోడల్స్ కనిపిస్తున్నాయి. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ తో పాటు, మంచి మైలేజ్‌ని కూడా ఇస్తుండడంతో సేల్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.
- మారుతి స్విఫ్ట్/ డిజైర్: ఇండియన్ మార్కెట్లో మారుతి కార్ల కున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మారుతి సక్సెస్ మైలేజ్ మాత్రమే. అందులో చాలా మంది ఇష్టంగా కొంటున్న వెహికల్ స్విఫ్ట్ LXI ఇది బేసిక్ వర్షన్ అయినా.. సాధారణ కుటుంబానికి సరిపడా ఫీచర్స్ ఉంటాయి. ఇక మైలేజ్ విజయానికి వస్తే హైవేలో 25 కిలోమీటర్లు ఇస్తుంది. ఇక షిఫ్ట్ డిజైర్ కూడా ఇంకా బడ్జెట్ పెట్టుకుంటే మిడిల్ క్లాస్ కు లగ్జరీ సెడాన్ కార్ దొరికినట్లే.. ఈ రెండు కార్లు కూడా 10 లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి.
- ఇక మైలేజ్ రేస్‌లో రెండో స్థానంలో టాటా: టాటాలో అన్నిటికంటే చిన్న కారు టియాగో. ఇది బేసిక్ మోడల్ ఆరు లక్షల నుంచి టాప్ ఎండ్ పది లక్షల లోపే దొరుకుతుంది. ఇక మైలేజ్ విషయానికొస్తే 20 కిలోమీటర్ల పైనే.. ఇక సేఫ్టీ విషయంలో టాటా ఫైవ్ స్టార్ రేటింగ్.
- ఇక మూడో ప్లేస్‌లో మారుతి బెలెనో: ఇది కూడా 8 లక్షల్లో బేసిక్ మోడల్. 1200 సీసీ తో 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే మిగతా కార్ల కంటే ఇందులో 88 బీహెచ్పీ తో కూడిన పికప్, 113 టార్క్ పవర్ కొంత బెటర్.
- ఆల్టో: ఇదే మారుతి కంపెనీకి చెందిన ఇండియన్ మిడిల్ క్లాస్ మోస్ట్ ఫేవరెట్ కార్ ఆల్టో. అతి తక్కువ బడ్జెట్లో ఐదు లక్షలకే ఈ కారు. పెట్రోల్ తో పాటు సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. 1000 సీసీ ఇంజన్ తో 25 కిలోమీటర్లు. సిఎన్జీ మోడల్ అయితే 34 కిలోమీటర్ల మైలేజ్.
- రెనాల్ట్ క్విడ్: ఇక మరో చిన్న కారు రెనాల్ట్ క్విడ్. ఇది కూడా ఆరు లక్షల నుంచి బేసిక్ మోడల్ మొదలవుతుంది. రెనాల్ట్ కంపెనీ కూడా ఈ కారుపై 22 కిలోమీటర్ల మైలేజ్ ప్లాన్ చేస్తున్నారు. కస్టమర్ రివ్యూల ప్రకారం.. చూస్తే 20 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది.
- టాటా పంచ్: ఇది మార్కెట్లోకి రిలీజ్ అయి నిజంగానే పోటీదారులకు పంచ్ ఇచ్చింది. కంపాక్ట్ suv మోడల్ లో రిలీజ్ అయిన ఈ కార్ 1200సిసి. అన్ని ఫీచర్స్ తో 10 లక్షలు ఈ కారును కొనవచ్చు. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న పంచ్ 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
- హుండాయ్: రలో మార్కెట్లోకి రిలీజ్ కాబోతున్న హుండాయ్ కాస్పర్ కూడా మైలేజీలో నేను పోటీలో ఉంటానంటూ దూసుకొస్తుంది. ఇండియన్ మిడిల్ క్లాస్ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని 1000 సీసీలో హుండాయ్ ఈ కంపెనీని తయారు చేసింది. 21 కిలోమీటర్లు ఇస్తుందని ఇప్పటికే హుండాయ్ ప్రకటించింది. వచ్చే నెలలో ఈ కారు మార్కెట్లోకి రిలీజ్ కానుంది.
మైలేజీలో పోటీపడే ఇంకా చాలా కారులు మార్కెట్లో ఉన్న పది లక్షల్లో లోపు బెస్ట్ మైలేజ్ ఇస్తూ అమ్ముడు అవుతున్న కార్లు మాత్రం ఇవే.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ 19వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి