బిగ్‌బాస్ సీజన్ 8 నిన్నటి ఎపిసోడ్లో రచ్చ రచ్చ చేసింది సోనియా. మాజీ కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తారని చెప్పడంతో హౌస్మేట్స్ షాకయ్యారు. అంతలోనే మెయిన్ డోర్ ఓపెన్ అయి అక్కడి నుంచి సోనియా రీఎంట్రీ ఇచ్చించి. ఆమె రాగానే పృథ్వీ, నిఖిల్ హగ్స్ ఇచ్చారు. ముందుగా సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. వేరేవాళ్లు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో దూరతావు. అలాగే చాలా పొగరుగా బిహేవ్ చేస్తావు.. గౌతమ్ కు పనిష్మెంట్ పేరుతో చాలా పనులు చెప్పావు.. కానీ నబీల్ కు మాత్రం పనిష్మెంట్ ఇవ్వలేదు. నీకు ఫ్రెండ్స్, ఎమోషన్స్ అన్నీ కావాలి.. కానీ పృథ్వీని బయటకు పంపేయాలి అంటావు అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. దీంతో ప్రేరణ అక్కా అని పిలవడంతో చెప్పు చెల్లే అంటూ అల్లాడించేసింది. అక్కా అన్న మాటకు పట్టుబట్టి మరీ సారీ చెప్పించుకుంది సోనియా.
ఇక తర్వాత నిఖిల్ ను నామినేట్ చేస్తూ..’నా పెద్ద కొడుకు.. నన్ను హౌస్ లో అమ్మలా చూసిన కంటెస్టెంట్.. నా మనసుకు దగ్గరైన నా కొడుకు.. ప్రేరణ నాకు చేసిన తమ్ముడు’ అంటూ పిలిచింది. నిఖిల్ డబుల్ స్టాండర్స్ అని.. ఫేస్ టూ ఫేస్ చెప్పే దమ్ములేదని.. నామినేషన్స్ కూడా సరిగ్గా చేయడు అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. యష్మీని అక్కా అన్నందుకు గౌతమ్ ను నామినేట్ చేశావ్ కదా..మరీ అలా వేరే అమ్మాయిల కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటూ కడిగిపారేసింది. తేజ పాము నోట్లో ఎగ్ వేసి తప్పు చేశాడని అన్నావు.. మరీ అదే తప్పు యష్మీ చేస్తే ఎందుకు ఒప్పుకోలేదు. ఆల్రెడీ తేజకు పనిష్మెంట్ పడింది.. అయినా నువ్వు యష్మీ తప్పును ఒప్పుకోలేదు అంటూ సీరియస్ అయ్యింది. దీంతో నీళ్లు నమిలాడు నిఖిల్.
యష్మీ నువ్వంటే ఇష్టం అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని నువ్వు మళ్లీ రోహిణి దగ్గర ఎందుకు మాట్లాడవు. ఓ అమ్మయి ఎమోషన్స్‌కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అంటూ ఫైర్ అయ్యింది. యష్మీకి ఎప్పుడో చెప్పాను అంటూ నిఖిల్ కవర్ చేసేందుకు ట్రై చేశాడు. అలా చెప్పి మళ్లీ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఎందుకు ఫ్లర్ట్ చేస్తావు అని సోనియా అడగ్గా.. నేను ఫ్రెండ్ గా ఉన్నాను అని అన్నాడు నిఖిల్. దీంతో మధ్యలోకి దూరిపోయి యష్మీ సీరియస్ అయ్యింది. నువ్వు ఎప్పుడూ నాకు చెప్పలేదు. అలా చెప్పి ఉంటే నేను నీ జోలికి వచ్చేదాన్ని కాదు. ఇక్కడ అందరి ముందు బ్యాడ్ అయ్యింది నేను అంటూ ఎమోషనల్ అయ్యింది యష్మీ.
ఇవి కూడా చదవండి
ఇక నిఖిల్ చెప్పిన విషయాన్ని రోహిణి కూడా తప్పుబట్టింది. నాకు వేరేలా చెప్పావు అంటూ అసలు విషయం బయటపెట్టడంతో నిఖిల్ తడబడ్డాడు. ఇక సోనియా వెళ్లిపోయిన తర్వాత కూడా నిఖిల్, యష్మీ మధ్య గొడవ పెద్దగానే జరిగింది. దీంతో ఆమెకు క్లారిటీ ఇచ్చేందుకు నిఖిల్ ట్రై చేసినా.. యష్మీ మాత్రం వినిపించుకోలేదు. మొత్తానికి సోనియా రాకతో నిఖిల్ టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి.
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.