Black Rose: ప్రపంచంలో నేచరల్ బ్లాక్ రోజ్ పూచే ఏకైక ప్రదేశం టర్కీ.. భలే డిమాండ్ ఈ పువ్వుకి.. నల్ల గులాబీ గురించి తెలుసుకోండి..

2 hours ago 1

ప్రకృతిలో అందాలు అనగానే పువ్వులు గుర్తుకొస్తాయి. రంగు, రూపు, వాసనలతో ఆకట్టుకుంటాయి. ఒకొక్క పువ్వుది ఒకొక్క తీరు. దేనికదే అందం అనిపిస్తాయి. అలాంటి అందమైన పువ్వుల్లో గులాబీ పువ్వులు కూడా ఒకటి. సుగంధానికి, ఆకర్షణకు పెట్టింది పేరు గులాబీ పువ్వు.. దీనిలో లెక్కకు మించి రకాలున్నాయి. అడవి జాతుల గులాబీలు 150 రకాలు ఉండగా.. మానవ సృష్టి అయిన సంకర జాతి గులాబీలు 30,000 వేల రకాలున్నాయి.

Surya Kala

|

Updated on: Nov 21, 2024 | 2:33 PM

గులాబీ పువ్వుల్లో అతి పెద్ద పువ్వు సుమారు  33 ఇంచుల వెడల్పుతో ఉంటుంది. ఇక అతి చిన్న గులాబీ పువ్వు బియ్యం గింజ సైజ్ లో ఉంది. మార్కట్ లో రకరకాలు గులాబీ పువ్వులు రకరకాల రంగుల్లో దొరుకుతాయి. వీటిల్లో కొన్ని తీగ జాతికి చెందినవి కాగా.. మరికొన్ని మొక్క జాతికి చెందినవి.

1 / 11

గులాబీలు అంటే గులాబీ రంగు, పసుపు, ఎరుపు, తెలుపు వంటివి ఎక్కువగా గుర్తుకొస్తాయి. అనేకాదు కొన్ని రంగుల కలయికతో ఉన్న గులాబీలు కూడా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. అయితే నలుపు రంగు గులాబీని ఎప్పుడైనా చూశారా.. అది కూడా ప్రకృతిలో సహజంగా పూచే బ్లాక్ కలర్ రోజ్ గురించి మీకు తెలుసా..

2 / 11

వెల్వెట్ గులాబీనే నలుపు రంగు గులాబీ అని అంటారు. ఇది చూసేందుకు నల్లగా కనిపిస్తుంది. నలుపు రంగు గులాబీ సహజంగా భూమిపై పెరిగే ఏకైక ప్రదేశం ఉంది. అవును ఈ నల్ల గులాబీలు ప్రపంచంలో టర్కీలో మాత్రమే పెరుగుతాయి.

3 / 11

నగరాల్లో జీవన వేగాన్ని తగ్గించడానికి, పర్యావరణ సామరస్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటు అయిన రోజ్ యూనియన్ సంస్థ టర్కీలోని ఓ ప్రధాన నగరంలో పూచే నల్ల గులాబీని ప్రపంచానికి పరిచయం చేసింది.

4 / 11

ఆగ్నేయ ప్రావిన్స్‌లోని హాల్ఫెటి జిల్లాలోని కొన్ని నేలల్లో మాత్రమే ఈ నల్ల గులాబీ సహజంగా పెరుగుతుంది. డార్క్ కలర్ తో నల్ల గులాబీ .. దీని రేకులతో ప్రసిద్ధి చెందింది. ఈ పువ్వు  మార్చి-ఏప్రిల్,  అక్టోబర్-నవంబర్లలో వెల్వెట్ రంగుని తలపించేలా డార్క్ నలుపు రంగును కలిగి ఉంటుంది. ఇతర సీజన్లలో ఈ పువ్వు రంగు కొద్దిగా మారుతుంది.

5 / 11

ఈ నల్ల గులాబీలు, టర్కిష్‌లో "కరాగుల్" అని పిలుస్తారు. ఇతర గులాబీ మొక్కలకంటే బలమైన ముళ్ళు ఉంటాయి. ఈ గులాబీ మొక్కలు ప్రత్యేకమైన PH స్థాయితో సహా విలక్షణమైన లక్షణాలను కలిగి ఉన్న హల్ఫెటీ పట్టణంలోని నేలల్లో మాత్రమే పెరుగుతాయి. వెల్వెట్ గులాబీలు నల్లగా కనిపిస్తాయి.

6 / 11

ఇర్రెసిస్టిబుల్ తీపి వాసనతో ఇంద్రియాలను మైమరపిస్తాయి. గులాబీ మొగ్గలు కూడా ముదురు రంగులో ఉంటాయి. మొగ్గ పూర్తిగా పువ్వుగా వికసిస్తే ఆ పుష్పం తీవ్రమైన రెడ్ వైన్ రంగులో కనిపిస్తుంది.

7 / 11

ఇప్పుడు హాల్ఫెటీ నివాసితులు తమ నల్ల గులాబీని బ్రాండ్‌గా మార్చాలనుకుంటున్నారు. ఎందుకంటే టర్కీలో గులాబీలతో చేసే వ్యాపారం ప్రపంచ ప్రసిద్దిగాంచింది.  నేడు టర్కీ, బల్గేరియా దేశాల్లో ప్రపంచంలోని గులాబీ నూనె ఉత్పత్తిలో 80 శాతం వరకు ఉన్నాయి.

8 / 11

నల్ల గులాబీల పెంపకాన్ని ప్రోత్సహించడానికి వ్యాపార ప్రణాళికతో ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తాంబుల్‌కు కొలోన్‌లు, టర్కిష్ డిలైట్ , ఐస్‌క్రీం కోసం ఈ నల్లని గులాబీ రేకులను సరఫరా చేస్తున్నారు. రోజు రోజుకీ ఈ గులాబీలకు డిమాండ్ పెరిగిపోతోంది. ముక్యంగా ఈ నల్లని గులాబీలతో కరాగుల్ వైన్ తయారు చేస్తున్నారు. ఈ వైన్ కు ఇస్తాంబుల్‌లో విపరీతమైన మార్కెట్ ఉంది.

9 / 11

గువ హాల్ఫెటీలో పట్టణంలోని వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఒక గ్రీన్‌హౌస్‌లో 1,000 నల్లని గులాబీ మొక్కలు ఉన్నాయి. అయితే 2000వ దశకం ప్రారంభంలో యూఫ్రేట్స్ నదిపై ఒక ఆనకట్ట నిర్మాణ సమయంలో ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ పువ్వుని రక్షించుకోవడానికి ఆ పట్టణ ప్రజలు భారీ ర్యాలీ చేశారు.

10 / 11

అయితే ప్రస్తుతం టర్కీలో పదహారుతో రంగుల నల్ల గులాబీలు సహా ప్రపంచవ్యాప్తంగా 20 రకాల నల్ల గులాబీలు ఉన్నట్లు వృక్షశాస్త్రజ్ఞుడు అలీ ఇకిన్సి చెప్పారు. అయితే హాల్ఫెటి జిల్లాలోని కొన్ని నేలల్లో దొరికే నల్ల గులాబీలు లాంటివి కావని అన్నారు. ఎందుకంటే ఇక్కడ నల్ల గులాబీ మొక్కను ప్రపంచంలో వేరే ఎక్కడ నాటినా అక్కడ పూసే పువ్వు నల్లగా లేదా రెడ్ వైన్ కలర్ లో ఉందని చెప్పారు.

11 / 11

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article