Border-Gavaskar trophy: ఐపీఎల్ హవా ఎలా ఉందో చూడండి.. పెర్త్‌లో పంత్-నాథన్ లియోన్ సరదా సంభాషణ

5 hours ago 1

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ మొదటి టెస్టు ప్రేక్షకులకు రసవత్తరంగా సాగింది. బౌన్సీ పిచ్‌పై బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తం 17 వికెట్లు పడగా, బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ మ్యాచ్ లో మరొక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్‌ల మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పంత్-లియోన్ సరదా సంభాషణ బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్‌ను లియోన్ “మీరు ఐపీఎల్ వేలంలో ఏ జట్టులో చేరబోతున్నారు?” అని ప్రశ్నించాడు. దీనికి పంత్ చమత్కారంగా “నాకు ఐడియా లేదు” అని సమాధానమిచ్చాడు. ఈ హాస్య భరిత సంభాషణ స్టంప్ మైక్ ద్వారా బయటికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ లో ఆటగాళ్ల మధ్య ఇలాంటి సరదా క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటాయి.

భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా బౌలర్లకు తలొగ్గి కేవలం 150 పరుగులకే ఆలౌటైంది. నితీష్ రెడ్డి (41) తన అరంగేట్రంలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ (37) దూకుడుగా ఆడినప్పటికీ, జట్టుకు పెద్ద స్కోరు అందించలేకపోయాడు. కేఎల్ రాహుల్ (26) ఫర్వాలేదనిపించినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు.

భారత బౌలర్లు అయితే అందరికి ఆసీస్ బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. జస్ప్రీత్ బుమ్రా మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్‌ను కుదేలు చేశాడు. మొహమ్మద్ సిరాజ్, అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 57/6తో కష్టాల్లో పడింది.

ఐపీఎల్ ఊహాగానాలు రిషబ్ పంత్‌పై ఐపీఎల్ వేలం గురించి ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. సునీల్ గవాస్కర్ అయితే పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేయకపోవడం వెనుక ఆర్థిక కారణాలు ఉండవని అభిప్రాయపడ్డారు. పంత్ ఈ ఊహాగానాలను ఖండిస్తూ, తన ప్రాధాన్యత డబ్బు కాదని స్పష్టం చేశాడు. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో జరగనున్న ఐపీఎల్ వేలం పంత్ వంటి టాలెంట్‌పై ఫ్రాంచైజీల దృష్టిని మరల్చనుంది.

మొదటి రోజు ఆట బౌలర్ల ప్రాభవంతో పాటు సరదా సంఘటనలతోనూ అభిమానులను అలరించింది. పంత్-లియోన్ మధ్య స్నేహభావం, బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన, ఐపీఎల్ ఊహాగానాలు ఈ సిరీస్‌కు మరింత ఆకర్షణ జోడించాయి.

SOUND 🔛 Just 2 aged friends meeting! 😁🤝

Don't miss this stump-mic golden ft. 𝗥𝗜𝗦𝗛𝗔𝗕𝗛-𝗣𝗔𝗡𝗧𝗜! 🤭

📺 #AUSvINDOnStar 👉 1st Test, Day 1, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/vvmTdJzFFq

— Star Sports (@StarSportsIndia) November 22, 2024

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article