పెర్త్‌లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ తొలి మ్యాచ్ మూడవ రోజు విరాట్ కోహ్లీ తన 30వ టెస్ట్ సెంచరీతో అద్భుత ప్రదర్శనతో అందరిని అలరించాడు. మ్యాచ్‌లో కీలక పరిస్థితుల్లో, భారత జట్టు అనిశ్చిత స్థితిలో ఉండగా, కోహ్లీ తన అసమానమైన ఆటతీరు ద్వారా జట్టును నిలబెట్టాడు. 81వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసిన తర్వాత, కోహ్లీ తన హెల్మెట్‌ను తీసి, భావోద్వేగంతో సెంచరీను సెలబ్రేట్ చేశాడు.
తన అద్భుత ప్రదర్శనతో భారత శిబిరాన్ని ఉర్రూతలూగించిన కోహ్లీకి సహచర ఆటగాళ్లతో సహా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆత్మీయతను చూపారు. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్నప్పుడు గంభీర్, కోహ్లీ ఒకరినొకరు కౌగిలించుకుని భావోద్వేగపూరిత క్షణాన్ని పంచుకున్నారు.
కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా స్టాండ్స్‌లో ఉత్సాహభరితంగా తానెలా మద్దతుగా నిలబడిందో చూపించింది. కోహ్లీ మాట్లాడుతూ, అనుష్క తన జీవితంలో ప్రతికూల, అనుకూల పరిస్థితుల్లో ఎలా తోడుగా నిలిచిందో గుర్తుచేసుకున్నాడు. “ఆమె నాకు ఎన్నో సందర్భాల్లో ప్రేరణ ఇచ్చింది. దేశం కోసం ప్రదర్శన చేయడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆమె ఇక్కడ ఉండటం ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది,” అని కోహ్లీ పేర్కొన్నాడు.
బీసీసీఐ ఈ గర్వకారణ క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంది, కోహ్లీ తన 16 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ సాధించి సెంచరీల కరువును తీర్చుకున్నాడని అభినందించింది. టెస్టు ఫార్మాట్‌లో కోహ్లీ 119 మ్యాచ్‌ల్లో 30 సెంచరీలు సాధించి, మొత్తం 9,145 పరుగులు చేశాడు. ఈశతకంతో విరాట్ తిరిగి తన ఫార్మ్ లోకి వచ్చాడని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Gautam Gambhir hugs Virat Kohli aft his period astatine Perth GG backed him erstwhile cricket fraternity said that Kohli's signifier is simply a superior interest earlier BGT #INDvsAUS #AUSvINDIA #BGT2024 #IPLretention pic.twitter.com/uqKvAIAywN
— Gauti Harshit Dhiman (GG Ka Parivar) (@GautiDhiman) November 24, 2024