నవంబర్ 22న ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భాగంగా కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్‌కి అందుబాటులో లేకపోవడంతో, జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్టు ఒక నివేదిక పేర్కొంది.
రోహిత్ కి కొడుకు పుట్టడంతో తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి బీసీసీఐ అనుమతితో మొదటి టెస్ట్‌కు దూరంగా ఉంటున్నారు. అడిలైడ్‌లో జరిగే రెండో పింక్ బాల్ టెస్టు కోసం రోహిత్ జట్టులో చేరతారని భావిస్తున్నారు. దీంతో వైస్ కెప్టెన్, ప్రస్తుతం జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. బుమ్రా నాయకత్వంలో జట్టు బౌలింగ్ విభాగం మరింత ఉత్సాహంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను ఇబ్బందులకు గురిచేయగలదు.
ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మొదటి టెస్ట్‌లో తన అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. పెర్త్ పిచ్ అదనపు బౌన్స్ అవ్వనుండటంతో నితీష్ కుమార్ నాలుగో పేసర్ గా జట్టులో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నితీష్ రావడంతో బౌలింగ్ విభాగం మరింత బలంగా తయారైంది.
రాహుల్, ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో గాయపడినప్పటికీ, WACA స్టేడియంలో సాధారణ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇది జట్టుకు ఊరట కలిగించే విషయం. రాహుల్ ఈసారి రాణించడం జట్టుకు అత్యంత కీలకం కానుంది. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ లైన్‌ప్ గాఢిలో పడుతుందని అందని ఆశిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ వంటి ఫాస్ట్ బౌలర్లకు మద్దతుగా, జట్టులో సీనియర్ ఆటగాళ్ల సలహాలు కీలకమవుతాయి.
సిరీస్ లో తొలి మ్యాచ్ ప్రత్యేకత:
భారత జట్టు ప్రారంభ టెస్ట్‌లో విజయం సాధించి సానుకూలంగా ముందడుగు వేయాలని యోచిస్తోంది. పెర్త్ పిచ్ గుణగణాలను బట్టి, వేగం, బౌన్స్ కీలక పాత్ర పోషిస్తాయి, ఇది బుమ్రా నేతృత్వంలోని పేస్ దళానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ నివేదిక ప్రకారం, జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో, భారత క్రికెట్ జట్టు కొత్త శకానికి ఆరంభం కానుంది. నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్ల అరంగేట్రంతో, ఈ మ్యాచ్ జట్టు నిర్మాణంలో కీలక మలుపుగా నిలవవచ్చు. పెర్త్ పిచ్‌లో భారత పేస్ దళం ఎలా ప్రభావం చూపిస్తుందో చూడాలి.