Brahmamudi, November 16th Episode: అనామిక ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. పెద్దాయన ప్లాన్ అదుర్స్!

2 hours ago 1

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. ధాన్యలక్ష్మి భోజనం రాకపోవడంతో డిస్కర్షన్ మొదలవుతుంది. ఆస్తుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పాం కదా.. ఇంకా ఎందుకు పట్టుదల అని ఇందిరా దేవి అంటే.. తను అనుకున్నది సాధించేంత వరకు వదలదని ప్రకాశం అంటాడు. రోజు రోజుకూ ఈ ఇంట్లో మనుషులకు మానవత్వం చచ్చిపోతుంది. ఎదుటి వాళ్ల బాధ, ఏడుపును పట్టించుకునే దిక్కే లేకుండా పోయారని రుద్రాణి అంటుంది. అయ్యో మీరెందుకు బాధ పడుతున్నారు? మీరు ఏడవండి నేను పట్టించుకుంటాను. మీరు నిజంగా ఇంత బాధ పడుతూ ఉంటే.. మాతో కూర్చుని తినడం ఎందుకు? ఆంటీ పక్కన కూర్చొని ఓదార్చవచ్చు కదా అని స్వప్న అంటుంది. అది తన వల్ల ఎలా అవుతుంది? అది ఏడ్చిన ప్రతి సారీ పక్కన కూర్చొని ఓదార్చితే కొండ మీద ఉన్న కోతిని కూడా తీసుకురమ్మంటుంది.. ఎక్కడి నుంచి తీసుకు రమ్మంటావ్? ఏం కాదులే తిను అని ప్రకాశం అంటాడు.

రాజ్, కావ్యల డిస్కర్షన్..

రేయ్ ప్రకాశం ఏంట్రా మాటలు.. కోడలు భోజనం చేయకుండా బాధ పడితే అలా మాట్లాడతావే.. వెళ్లి తీసుకురమ్మని సీతారామయ్య అంటాడు. దాని గురించి మీకు తెలియకపోయినా.. నాకు తెలుసు నాన్నా.. అది ఆకలికి అస్సలు తట్టుకోలేదు. దొంగ చాటుగా అయినా వచ్చి తింటుంది. అలా చాలా సార్లు చూశానులే. మనం అందరం తినేశాక వచ్చి తింటుందని ప్రకాశం అంటాడు. దీంతో అందరూ నవ్వుతారు. ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టినా.. వీళ్లను రెచ్చగొట్టలేక పోతున్నా.. లాభం లేదు డోస్ పెంచాలని రుద్రాణి మనసులో అనుకుంటుంది. మరోవైపు కళావతి ఎంప్లాయిస్‌ని డిజైన్స్ చూపించమని అడుగుతుంది. అప్పుడే రాజ్ వచ్చి.. మా ‘టింగ్’ ఉండగా.. మీ ‘టింగ్’ పెట్టారేంటి? వెంటనే ఖాళీ చేయమని రాజ్ అంటాడు. దీంతో అందరూ లేస్తారు? మీరెందుకు లేచారు? కూర్చోమని కావ్య అంటుంది. మేము ఇక్కడ ఆడుకోవడానికి రాలేదు.. డిజైన్స్ గురించి డిస్కర్షన్ చేస్తున్నాం.. మీరు మీ మీటింగ్ వేరే దగ్గర పెట్టుకోమని కావ్య అంటుంది. దీంతో రాజ్ ఎంప్లాయిస్‌ని బెదరిస్తారు. మీరేం చేసినా మా టీమ్ ఇక్కడి నుంచి కదలదని కావ్య అంటుంది.

జగదీష్‌కి తెలిసిపోయిన నిజం.. మ్యానేజ్ చేసిన రాజ్జజ

మిస్టర్ మేనేజర్.. మీరు ఏం ఆర్డర్ వేస్తారు? అని కావ్య అంటే.. రాజ్ కావ్యని బెదిరిస్తాడు. ఇలా ఇద్దరూ దెబ్బలాడుకుంటూ ఉండగా.. అక్కడికి జగదీష్ చంద్ర వస్తాడు. నేను విన్నది నిజమే అన్న విషయం అని అంటాడు. ఏం విన్నారు..? అని రాజ్ సైలెంట్ అవుతాడు. కాదు మీరిద్దరూ విడిపోయారని? కంపెనీ గురించి పట్టించుకోవడం లేదని మార్కెట్‌లో అందరూ అనుకుంటున్నారని జగదీష్ అంటాడు. మార్కెట్లో కూరగాయలు కొనకుండా.. మా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారని రాజ్ తెలివి తక్కువగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈయన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే.. కళావతి ఈ సీటును వదలదు. ఎలాగైనా మ్యానేజ్ చేయాలని రాజ్ నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారో చెప్పమని కావ్య అడుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు ఇలా ఎందుకు పని చేస్తారు? కలిసి కట్టుగా ఉండి ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నామని అంటాడు. అంటే మీరిద్దరూ గొడవ పడటం నిజం కాదా? అని జగదీష్ అంటే.. రాజ్ అర్థం కానట్టు మాట్లాడతాడు. మేము కలిసి డిస్కర్షన్ చేసుకుంటున్నామని చెబుతాడు. అయినా జగదీష్ నమ్మనట్టు మాట్లాడతాడు. మరి ఎందుకు గొడవ పడుతున్నారు. అని అంటే.. రాజ్ ఏదేదో చెప్తాడు.. కలిసి పని చేస్తే డిజైన్స్ ఒకేలా వస్తాయి.. కానీ వేరుగా పని చేస్తే వేరే వేరే డిజైన్స్ వస్తాయి కదా.. అందుకే అని కావ్యని అడుగుతూ నడుము మీద చేయి వేస్తాడు. కావ్య ఇక ఏమీ చెప్పలేక పోతుంది. అది చూసి అందరూ నవ్వుతారు.

ఇవి కూడా చదవండి

కావ్య నడుము మీద రాజ్ చేయి..

ఏయ్ ఏమీ మాట్లాడవేంటి? అని రాజ్ అడిగితే.. నడుము మీద చేయి వేస్తే ఏమీ మాట్లాడలేమని కావ్య అంటే.. వెంటనే రాజ్ చేయి తీస్తాడు. అప్పుడే కావ్య మాట్లాడతూ.. ఫ్లోలో అవును సర్ మేము కొట్టుకుని.. తిట్టుకుని.. పని చేస్తున్నామని అంటుంది. దీంతో జగదీష్ షాక్ అవుతాడు. అప్పుడే కావ్య పడబోతుంటే.. రాజ్ పట్టుకుంటాడు. అదంతా చూసి కావ్య, అక్కడున్న వాళ్లందరూ షాక్ అవుతారు. ఇక అందంతా చూసి జగదీష్ నమ్ముతాడు. ఏదో ఒకటి చేసి మంచి డిజైన్స్ ఇవ్వండి.. నేను ఇంకా కంగారు పడి పోయి డీల్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నాను.. బాగా చర్చించుకోమని అని వెళ్తాడు. ఆ తర్వాత రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఇక రాజ్ దగ్గరకు వెళ్లి.. ఏం చేశారు మీరు? అని కావ్య అడుగుతుంది. మేనేజ్ చేసిన వాళ్లను మేనేజర్ అంటారని మాకు తెలుసని కావ్య అంటుంది. ఆ జగదీష్ గారి ముందు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేశారు? అని కావ్య అంటే.. విడిపోలేదు అని చెప్పడానికి నోరు ఉంది కదా.. చెయ్యి ఎందుకు పని చేసిందని కావ్య అడుగుతుంది. నమ్మించడానికి చెబితే సరిపోదు.. అందుకని రాజ్ అంటాడు. అవునా అందుకని చేయి వేస్తారా? అని కావ్య అడుగుతుంది. నమ్మించడం కోసం నటిస్తారా? ఇది తప్పు కాదా? అని అడిగితే కాదని రాజ్ అంటాడు. అవునా అలా అయితే మా అమ్మ చేసింది కూడా తప్పు కాదని కావ్య అంటుంది.

సీతారామయ్య పెద్ద ప్లాన్..

మీ అమ్మ చేసింది వేరు.. ఇది వేరని రాజ్ అంటాడు. ఇది కరెక్ట్ అయినప్పుడు అది కూడా కరెక్టేనని కావ్య వాదిస్తుంది. అయినా రాజ్ అస్సలు నమ్మడు. మీ అమ్మ క్యాన్సర్ నాటకం ఆడి నన్ను మోసం చేసిందని రాజ్ అంటాడు. ఇక కావ్య ఇగోని రెచ్చగొట్టిన రాజ్.. మిమ్మల్ని ఓడించే వరకు నిద్రపోనని కావ్య అంటుంది. కట్ చేస్తే.. సీతారామయ్య, జగదీష్ కలుస్తారు. కాంట్రాక్ట్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని నన్ను నమ్మించడం కోసం.. నడుము మీద చేతులు వేయడాలు.. పట్టుకోవడాలు అబ్బబ్బా.. చూడటానికి నా రెండు కళ్లు సరిపోలేదు. అన్నీ నీ పోలికలే వచ్చాయి రా అని జగదీష్ అంటే.. అయినా నిన్ను వెళ్లి వాళ్ల ముందు గట్టిగా యాక్ట్ చేయమని అంటే.. కంప్రమైజ్ అయి వస్తావా? వాళ్లను మాటలతో భయపెట్టాల్సిందని సీతారామయ్య అంటే.. నీ మనవడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. మేము గొడవ పడటం లేదని చెప్పాడు. ఇక నీ మనవరాలు అయితే జీవించిందని జగదీష్ అంటాడు. లేదురా నా మనవరాలు మాత్రం నటించదురా.. రాజ్‌తోనే ఉండాలని కోరుకుంటుందని సీతారామయ్య అంటాడు. పెళ్లానికి లొంగి పోతేనే జీవితం బాగుంటుందని ఆ దేవుడే చెప్పాక వాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారు? అసలు నన్ను ముందే పిలిపించాల్సింది. అయినా మీ కంపెనీకి ఎంతో మంది శత్రువులు ఉన్నారు రా.. జాగ్రత్తగా ఉండాలని అంటాడు. ఎంతో కష్ట పడి కంపెనీ పెట్టావు. ఇప్పుడు ఈ చిన్న పిల్లల గొడవల వల్ల బయటి వాళ్లకు అవకాశం ఇవ్వకని జగదీష్ అంటే.. వాళ్లిద్దరూ కలిస్తే.. కంపెనీని టచ్ చేయడానికి కూడా ఎవరికీ ధైర్యం ఉండదని సీతారామయ్య అంటాడు. సరేలేరా ఓ పెగ్ ఏద్దామని జగదీష్ అంటే.. పెద్దాయన కుదరదంటాడు. ఇక పట్టుబట్టి జగదీష్ తీసుకెళ్తాడు.

అగ్రిమెంట్ విషయం చెప్పని కళ్యాణ్..

ఆ తర్వాత అప్పూ దగ్గరకు వచ్చిన కళ్యాణ్.. నీకో గుడ్ న్యూస్ అంటాడు. ఏంటీ తండ్రివి కాబోతున్నావా అని అప్పూ అడిగితే.. నీ ప్రమేయం లేకుండా అవుతానా అని కళ్యాణ్ అంటాడు. ఏమో మీ పెదనాన్నలాగా చిన్న ఇల్లు ప్లాన్ చేశావేమో అని అంటుంది అప్పూ. దీంతో కళ్యాణ్ ఫీల్ అవుతాడు. నీకు మంచి విషయం చెబుతాను అంటే.. నా మూడ్ అంతా పాడు చేశావ్.. పో అని కళ్యాణ్ అంటే.. ఇక తన స్టైల్‌లో ముద్దు ఇచ్చి ఇచ్చి కళ్యాణ్‌ని కూల్ చేస్తుంది అప్పూ. ఇక కళ్యాణ్ కరిగిపోయి.. లిరిక్ లక్ష్మీ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయిన విషయం చెప్తాడు. దీంతో అప్పూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే కానీ అతను జిడ్డు అస్సలు వదలడు అంటావు కదా.. మరి అతను అంత ఈజీగా నీకు ఎలా అవకాశం ఇచ్చాడు. కొపందీసి అగ్రిమెంట్ చేశావా అని అప్పూ అడిగితే.. కళ్యాణ్ మాట దాట వేస్తాడు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article