ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ స్టైల్‌గా రెడీ అయి ఆఫీస్‌కి బయలు దేరతాడు. ఎలాగైనా తనే గెలుస్తాననే ఆశతో బాగా ఓవరాక్షన్ చేస్తాడు. ఎలాగైనా నేనే గెలిచి వస్తాను.. ఇప్పుడు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పి.. ఆ తర్వాత కంగ్రాట్స్ చెప్పాలని రాజ్ అంటాడు. జీవితం అన్నాక గెలుపు, ఓటములు సహజం నాన్నా.. అన్నీ సమానంగా తీసుకోవాలని అంటాడు ప్రకాశం. నేనేం ఓడిపోనని రాజ్ అంటాడు. మమ్మీ నువ్వేం కంగారు పడకు.. నేనే గెలుస్తాను. నా జీవితంలోకి నేనే వెలుగుని నింపుకుంటానని రాజ్ అంటాడు. అపర్ణను ఆశీర్వదించమని అంటే.. పిల్లాపాపలతో చల్లగా ఉండమని అంటుంది. అందుకు రాజ్ సీరియస్ అవుతాడు. ఇక్కడ అంతకు మించి బ్లెస్సింగ్ రావు నాన్నా.. అక్కడేమన్నా ట్రై చేయమని అంటుంది. ఇక పెద్దావిడ దగ్గరకు వెళ్తే.. సుపుత్ర ప్రాప్తిరస్తు అని అంటుంది ఇందిరా దేవి. నేను గెలుస్తాను.. కళావతి ఓడిపోతుంది. ఎప్పటికీ కళావతి ఈ ఇంటికి రాదని అంటాడు రాజ్. అంతలోనే సుభాష్ వస్తాడు. డాడీ మీరు పుత్రోత్సాహంతో పొంగిపోయే రోజు వస్తుందని రాజ్ అంటే.. ఎప్పటికైనా కొడుకు పిల్లా పాపలతో కలిసి ఆనందంగా ఉంటే.. అంతకు మించింది ఉండదని సుభాష్ అంటాడు. డాడీ.. నేను కాంపిటీషన్‌లో గెలవడానికి అడుగుతున్నానని రాజ్ అంటే.. సరే మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అని సుభాష్ అంటాడు.
పాపం రాజ్.. ఇంట్లో వాళ్లు ఆడేసుకున్నారుగా..
నాకు తెలుసు.. మీరందరూ ఇలాగే దీవిస్తారు. కానీ రాజ్ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటారు.. కాబట్టి తాతయ్య నన్ను దీవించమని రాజ్ అడిగితే.. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని పెద్దాయన అంటాడు. నేను ఇప్పుడే చెబుతున్నా.. పందెం పందెమే.. కళావతి ఎప్పుడూ ఈ ఇంట్లోకి, ఆఫీసులోకి రాకూడదని అంటాడు రాజ్. వీడు ఇంత గట్టిగా చెబుతున్నాడు అంటే.. ఏదో మతలబు చేసే ఉంటాడని పెద్దావిడ అంటే.. అబ్బే అదేం లేదు. నిద్రాహారాలు మాని.. కష్టపడి డిజైన్స్ వేశానని రాజ్ అంటాడు. ఇదేంటి అమ్మా.. వాడికి ఫుల్ సపోర్ట్ నాదే ఉంటుందని రుద్రాణి అంటుంది. ఇక రాజ్ ఆఫీస్‌కి వెళ్తాడు. మరోవైపు ఆటో వాడు అటూ ఇటూ తిప్పి కావ్యని తీసుకెళ్తాడు. త్వరగా పోనివ్వు.. నేను ఆఫీస్‌కి వెళ్లాలి లేటు అవుతుందని కావ్య అంటుంది. త్వరగా వెళ్తే సార్‌కి కోపం.. ఈవిడ లేటుగా వెళ్తే నన్ను చంపేస్తుందని ఆటోవాడు అనుకుంటాడు. ఆ తర్వాత మరో రూట్‌కి తీసుకెళ్తాడు. ఈలోపు జగదీష్ చంద్ర ఆఫీస్‌కి వచ్చేస్తాడు. మీటింగ్ 10 గంటలకు కదా ఇంకా రాలేదని అంటాడు.
కావాలనే కావ్యని ఇరికించేసిన రాజ్..
తన తరుపున నేను సారీ చెబుతున్నాను.. తను టాలెంటెడే కానీ.. ఆలస్యాన్ని బ్రాండ్ ఎంబేజర్.. అని కావ్య గురించి చెడుగా చెబుతాడు. దీంతో కావ్య రాజ్‌ని తిడుతుంది. అప్పుడే కావ్యకి ఫోన్ చేస్తుంది శ్రుతి. ఎక్కడ ఉన్నారు? ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. మధ్యలో రోడ్డు ప్రాబ్లమ్ వచ్చిందని కావ్య అంటుంది. అప్పుడే ఆటో వాడు బైక్‌ని గుద్దేస్తాడు. ఇదే సమయం అనుకుని ఆటోవాడు కావాలని రెచ్చిపోతాడు. ఈలోపు రాజ్ ప్రజెంటేషన్ ఇస్తాడు రాజ్. ఇంకోవైపు గొడవ పడుతున్న వాళ్లను విడదీస్తుంది కావ్య. ఇక ఆటోలో ఆఫీస్‌కి బయలు దేరుతుంది. ఈలోపు రాజ్ డిజైన్స్ అన్నీ క్లయింట్‌కి చూపిస్తాడు. అది చూసిన శ్రుతి షాక్ అవుతుంది. అదేంటి ఇవి మేడమ్ వేసినవి కదా అని అనుకుంటుంది. ఇక జ్యువెలరీ చూసిన క్లయింగ్ జగదీష్ వావ్ సూపర్.. చాలా బాగున్నాయి.. మీ వర్క్ స్టార్ట్ చేయమని అంటాడు. అప్పుడే వచ్చిన కావ్య వాటిని చూసి షాక్ అవుతుంది. కావ్య గారు ఎలాగో వచ్చారు కదా.. మీ డిజైన్స్ చూపించమని జగదీష్ అడిగితే.. నావి కూడా ఇంచుమించు అలానే ఉంటాయని అంటుంది. అయినా ఆయనవే బాగున్నాయని చెబుతుంది. సరే అని జగదీష్ వెళ్తాడు. ఇక సంతోషిస్తూ రాజ్ వెళ్లిపోతాడు.
ఇవి కూడా చదవండి
దొరికిపోయిన రాజ్..
ఆ తర్వాత ఏంటి మేడమ్ మీరు ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. అంత కష్టపడి డిజైన్స్ వేశారు కదా.. ఇది కరెక్ట్ కాదు.. నాకు అస్సలు నచ్చలేదు. వాటిని వేసేందుకు మీరు ఎంతో కష్ట పడ్డారు కదా అని శ్రుతి అడుగుతుంది. అంత చూడలేక పోతే జాబ్ మానేసి వెళ్లిపో.. నేను ఈ కంపెనీకి సిఈవో అవ్వక ముందు ఆయన భార్యని. నా కష్టమైనా.. నా కష్టార్జీతమైనా ఆయనకే చెందుతుంది. ఏం చేసినా ఈ కంపెనీ కోసమే కదా.. నీకేంటి అంత బాధగా ఉంది. ఏమన్నా ఉంటే మేము మేమూ చూసుకుంటాం. నువ్వు లేని నారదుడిలా రెచ్చగొట్టొద్దని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజ్ చేసినది బయట పడుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..