ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఓడిపోయినందుకు రాజ్ ఏడిపిస్తాడు. అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అంటూ పాట పాడతాడు. గెలిచినంత మాత్రాన హీరోలు అయిపోరు మిస్టర్ రాజ్.. మనం చేస్తున్న పని కరెక్ట్ అయి ఉండాలి.. నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమైయింది అనుకుంట.. మీకు ఏం కావాలో నాకు బాగా అర్తమైందని కావ్య అంటుంది. అర్థమైయింది కదా.. ఇంకా ఇక్కడ ఎందుకు? సిఈవో బాధ్యతల నుంచి తప్పుకుని వెళ్లిపొమ్మని రాజ్ అంటాడు. అంతే కాకుండా అప్పటికే రిజైన్ లెటర్ కూడా రెడీ చేస్తాడు. అక్కడ సంతకం పెట్టి బయలేదేరమ్మని దారుణంగా అవమానిస్తాడు. పందెంలో గెలిచిన వాళ్లు సిఈవో అవుతారు. ఓడిపోయిన వాళ్లు ఏం చేయాలో అర్థమైయింది కదా.. అని అంటాడు. ఏంటి కళ్లు తిరుగుతున్నాయా లేకపోతే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి కదా.. బాధ పడకు ఫ్యూచర్‌లో ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడగమని రాజ్ అంటాడు. మీ అవసరం నాకు ఎప్పటికీ రాదు. వేరొకరికి దగ్గరకు వెళ్లి దేహీ అని అడిగే అవకాశం రాదని కావ్య అంటుంది. ఆ తర్వాత అందర్నీ పిలుస్తాడు రాజ్. కావ్యకి ఆల్ ది బెస్ట్ చెప్పించి.. దారుణంగా అవమానించి పంపిస్తాడు అంటాడు రాజ్.
ముర్ఖుడిలా రాజ్.. కళ్యాణ్‌కు ఘోర అవమానం..
ఆ తర్వాత ఆఫీసులోని ఎంప్లాయిస్‌ని అందర్నీ హడలెత్తిస్తాడు. ఇక నుంచి ఈ సామ్రాజ్యానికి నేనే చక్రవర్తి.. వెళ్లి అన్ని ఫైల్స్ తీసుకురమ్మని శ్రుతికి చెప్తాడు రాజ్. అక్కడే ఉన్న కావ్య సిఈవో బోర్డును తీసేసి.. డస్ట్ బిన్‌లో పాడేస్తాడు. మరోవైపు కళ్యాణ్ చేత పాటలు అన్నీ రాయించుకుంటూ ఉంటాడు లిరిక్ లక్ష్మీ. ఆ తర్వాత కళ్యాణ్‌ని ఆశీర్వాదం తీసుకోమని అంటాడు. అప్పుడే ఒక అతను వస్తాడు. పాట రాశారా.. అని అడిగితే.. ఇప్పుడే పూర్తి చేశానని డబ్బులు తీసుకుంటాడు. కళ్యాణ్ వెళ్లి సార్‌కి టీ పట్టుకు రమ్మని చెప్తాడు. దీంతో కళ్యాణ్ షాక్ అయి.. వెళ్లి టీ తీసుకొచ్చి ఇస్తాడు. అవును అప్పుడు అమ్మ పాట రాసింది నువ్వే కదా అని అంటే.. అందులో ఏముంది.. సముద్రంలో ఇసుక రేణువంత అని అంటాడు. అందంతా విని కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇలాంటి గురువు దొరకడం నీ అదృష్టం అని అతను కళ్యాణ్‌తో అంటాడు. ఏంటి తమ్ముడు.. టీ తీసుకు రమ్మన్నందుకు ఫీల్ అయ్యావా.. ఇలాంటివి పట్టించుకోకూడదు. ఇదిగో ఈ డబ్బులు తీసుకోమని ఇస్తాడు లిరిక్ లక్ష్మీ.
జీవితాంతం ఇక్కడే ఉంటాను..
మీరు నన్ను టీ తీసుకురమ్మన్నారో లేక డబ్బులు తక్కువ ఇచ్చినందుకు నేను బాధ పడటం లేదు సర్.. నేను రాసిన పాట అందరికీ నచ్చుతుంది. జనాల్లోకి వెళ్తుంది. అంటే నేను లిరిక్ రైటర్‌గా పనికొస్తానని అర్థమైందని కళ్యాణ్ అంటాడు. శభాష్ నా శిష్యుడివి అనిపించుకున్నావ్.. నీకు మరో ట్యూన్ ఇస్తాను రాయమని అంటాడు లిరిక్ లక్ష్మీ. ఇంకోవైపు కనకం కావ్య లగేజ్ అంతా సర్దేస్తుంది. మన కావ్య గెలుపు గుర్రాల మీద సవారీ చేస్తూ వచ్చి మనకు శుభవార్త చెబుతుంది. అమ్మా కావ్యా నీ కోసమే ఎదురు చూస్తున్నాం. వెళ్లి మొఖం కడుక్కుని చీర మార్చుకుని రమ్మని అంటుంది. ఆసల్యం అయితే మళ్లీ రాహు కాలం వచ్చేస్తుందని కనకం అంటుంది. నువ్వు రెడీ అయి వచ్చేలోపు బయట పెడతానని అంటే.. తీసుకెళ్లి లోపల పెట్టు.. ఇవాళే కాదు జీవితాంతం ఇక్కడే ఉంటున్నానని కావ్య అంటుంది. దీంతో కనకం, కృష్ణమూర్తి వాళ్లు షాక్ అవుతారు. నేను ఆయనకు, ఆ ఆఫీస్‌కి, ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోయానని కావ్య అంటుంది.
ఇవి కూడా చదవండి
పాపం కనకం కుప్పకూలిపోయింది..
ఏంటయ్యా ఇది అంటుంది.. నాకేం అర్థం కావడం లేదని కనకం అంటే.. వాళ్లు పెట్టిన పందెంలో నేను ఓడిపోయానని కావ్య అంటుంది. ముందుగా అనుకున్న మాట ప్రకారం.. ఇంకెప్పటికీ ఆఫీస్‌కి, ఇంటికి వెళ్లకూడదు కదా అని కావ్య అంటుంది. అది కాదని కనకం అంటే.. అవును నా చిటికన వేలు పట్టుకుని ఆ ఇంటికి తీసుకెళ్లని ఆయన.. చూపుడు వేలు చూపించి గెంటేశారు. ఇదంతా ఒక పీడ కల అనుకుని మర్చిపొమ్మని కావ్య అని గదిలోకి వెళ్తుంది. దీంతో కనకం, కృష్ణమూర్తి చాలా కంగారు పడతారు. మరోవైపు కావ్య గెలిచి వస్తుందని.. అపర్ణ.. హారతి రెడీ చేస్తుంది. ఏంటి రాజ్ ఓడిపోయాడా.. కావ్య గెలిచిందా.. అని అందరూ సంతోష పడతారు. ఏం జరిగిందో తెలీదు.. ఆ సమాచారం కోసమే ఎదురు చూస్తున్నానని స్వప్న అంటుంది.
ఆనందంలో దుగ్గిరాల ఫ్యామిలీ..
ఏం జరుగుతుంది ఈ ఇంట్లో.. అప్పుడే రాజ్ ఓడినట్టు.. కావ్య గెలిచినట్టు సంబరపడి పోతున్నారేంటి? రాజ్ కూడా గెలిచే అవకాశం ఉందని రుద్రాణి అంటుంది. అవును.. రాజ్ వాలకం చూస్తుంటే కాపురం నిలబెట్టుకునేవాడిలా ఏమీ కనిపించడం లేదని రాహుల్ కూడా అంటాడు. ఇంకా ఫోన్ ఎందుకు రాలేదు? ఈ అకు పక్షులు, దిక్కుమాలిన పక్షులు ఏవేవో కూల్చుతున్నారని ఇందిరా దేవి అంటుంది. ఇంతలోనే రాజ్ ఇంటికి వస్తాడు. ఓడిపోయిన నా కొడుకు.. గెలిచిన నా కోడల్ని తీసుకొస్తున్నాడని అపర్ణ అంటుంది. ఇక రాజ్ కావాలనే డల్‌గా వస్తున్నట్టే యాక్ట్ చేస్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో.. రాజ్ చేసిన నిర్వాకం బయట పడుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..