వాళ్లకి భూమ్మీద నూకలు ఇంకా ఉన్నట్టున్నాయి. వేగంగా వచ్చి రైల్వే గేటును ఢీకొట్టడంతో కారు ఆగింది కానీ.. లేకుంటే ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టి బీభత్సం జరిగి ఉండేది. రైలు గేటు ముందు బ్రేక్ వేసి ఆపాల్సిన డ్రైవర్ ఏదో ఆలోచనలో బ్రేక్ వేయబోయి ఎక్స్‌లేటర్‌ను బలంగా తొక్కాడు. దీంతో కారు ఒక్కసారిగా రైలు గేటును బలంగా ఢీకొట్టి అందులో ఇరుక్కుపోయింది. అదే సమయంలో పట్టాలపై వేగంగా దూసుకొచ్చిన రైలును చూసి కారులో వారికి గుండె ఆగినంత పనైంది. రైలు గేటును కొడితే కొట్టాం కానీ, లేకుంటే రైలు కింద పడి నుజ్జయిపోయి ఉండేవాళ్లమంటూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాలైతే దక్కాయి కానీ కేసు మాత్రం నమోదైంది.
ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచేడు రైల్వే గేట్ వద్ద పెనుప్రమాదం తప్పింది. తెల్లవారు జామున కారంచేడు నుంచి చీరాల వస్తున్న ఓ కారు అదుపుతప్పి కారంచేడు రైల్వే గేటును బలంగా ఢీ కొట్టింది. బ్రేక్ వేయబోయి ఎక్స్‌లేటర్‌ను మరింత బలంగా తొక్కడంతో కారు ముందుకు దూసుకుపోయి రైల్వే గేటను ఢీకొట్టి ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్‌తో సహా మరో వ్యక్తి ఉన్నాడు. కారు బలంగా ఢీకొనడంతో రైల్వే గేటు దెబ్బతినడంతో పాటుగా సగానికి పైగా కారు గేటులోకి దూసుకుపోయింది. కాస్తంత ఉంటే కారు గేటు వేసి ఉండగానే ట్రాక్‌పైకి దూసుకువెళ్లేది. అదే సమయంలో అటు వచ్చిన రైలు కారును ఢీకొట్టి ఉంటే.. బీభత్సం జరిగి ఉండేది. అయితే రైల్వే గేటు కారును నిలువరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో ట్రాక్‌పై రైలు రావడం, కారు దగ్గర ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సమాచారం అందుకున్న చీరాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి