తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతూ ఉంటాయి. చాలా మంది ఈ విషయాన్ని బయట పెట్టారు. ఏదో ఒకటి రాసి.. తగ్గించేసుకుంటారు. ఇది చెప్పేందుకు అంత పెద్ద సమస్య కాదు.. దాచేందుకు చిన్న సమస్య కూడా కాదు. తొడలు రాసుకుని ఎర్రగా దద్దర్లు వచ్చి కంది పోతూ ఉంటే.. ఆ ప్రాంతంలో చాలా నొప్పిగా ఉంటుంది. నడిచేందుకు కూడా ఇబ్బంది ఉంటుంది. చాలా మంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ఉంటారు. కానీ ఎవరూ పెద్దగా చెప్పరు. రోజులో ఎక్కువగా భాగం నడిచేవారికి, చెమట ఎక్కువగా పట్టేవారు. తొడలు లావుగా ఉండేవారికి.. తొడలు అనేవి రాసుకుని కందిపోతూ ఉంటాయి. ఇతర సీజన్ల కంటే ఎక్కువగా వేసవి కాలంలో తరచూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండాలి. మంటగా, దురదగా కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ సమస్యతో మహిళలు బాధ పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలీక సతమతమవుతూ ఉంటారు. ఈ చిట్కాలు ట్రై చేస్తే.. ఈ సమస్య నుంచి బయట పడతారు.
వాజెలిన్:
తొడలు రాసుకుని ఎర్రగా దద్దుర్లు వచ్చి, మంట పుట్టి, దురద వచ్చినా వాజెలిన్ రాస్తే చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. బాడీ గ్లైడ్ కూడా ఉపయోగించుకోవచ్చు. మంట పుట్టే ప్రదేశంలో ఇది రాస్తే.. చాలా వరకు దురద, మంట కంట్రోల్ అవుతాయి.
పౌడర్స్:
మీరు తరచూ ఉపయోగించే పౌడర్స్ లేదంటే టాల్కమ్ పౌడర్, రోల్ ఆన్ డియోస్ వంటి పౌడర్లు వేస్తే.. మంట, దురద, ఎరుపు దనం అనేవి తగ్గుతాయి. వీటిని త్వరగా ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిని రాత్రిపూట ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత పౌడర్ రాయండి.
ఇవి కూడా చదవండి
స్టాకింగ్స్ ధరించండి:
ఈ సమస్యతో ఎక్కువగా మహిళలే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు స్టాకింగ్స్ వంటి ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తే తొడలు రాసుకునే సమస్యల నుంచి బయట పడతారు. ఇవి ఇప్పుడు అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి.
పసుపు – నూనె:
కొబ్బరి నూనెలో, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేవి అధికంగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. రాత్రి స్నానం చేసిన తర్వాత నిద్రించే సమయంలో కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపు కలిపి తొడలు రాసుకున్న ప్రదేశంలో పెడితే.. దురద, మంట సమస్యలు అనేవి తగ్గుతాయి.
ఐస్ క్యూబ్స్ మసాజ్:
ఐస్ క్యూబ్స్‌ని ఓ కాటన్ క్లాత్‌లో చుట్టి.. సమస్య ఉన్న ప్రదేశంలో కాసేపు మర్దనా చేస్తే.. సమస్య నుంచి బయట పడతారు. ఇలా తరచూ ఐదు నిమిషాలకు ఒకసారి చేయాలి. ఆ తర్వాత క్లాత్‌తో తుడిచి.. పౌడర్ లేదా వాజెలిన్ రాయవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.