వరంగల్ నగర ప్రజల దాహార్తిని తీర్చిన భద్రకాళి చెరువు ప్రస్తుతం సమ్మర్ వాటర్ స్టోరేజీ జలాశయంగా ఉపయోగపడుతుంది. ఈ చెరువు క్రమక్రమంగా కబ్జాకు గురికావడంతో ప్రస్తుతం 382 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ చెరువును పరిరక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చొరవతో చెరువు ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడ్డాయి. చెరువు లో పూడిక తీసి, శుద్ధి చేయాలని, బౌండరీస్ ఫిక్స్ చేయాలని భావించారు.. కొత్త అందాలతో అందులో బోటింగ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు.. అందులో భాగంగా ఈ నెల 09 వ తేది నుండి చెరువు నీటిని దిగువకు వదలడం ప్రారంభించారు. దాదాపు 8 రోజులు వ్యవదిలోనే చెరువు నీరంతా ఖాళీ అయింది. కాపువాడ ప్రాంతంలోని మత్తడికి గండి కొట్టిన అధికారులు ఆ నీటిని నాగారం చెరువులోకి మళ్లించారు. చెరువు నీరంతా దిగువకు వదిలేయడంతో ఈ భారీ చెరువు ఎడారిని తలపిస్తోంది. చెరువు ఖాళీ అవడంతో మత్స్యకారులు, చేపల ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. రకరకాల చేపలు జాలర్లకు చిక్కడంతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.