ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)పూర్తి షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ తలపడే అవకాశం ఉంది. పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్ సీజన్‌లోనే నిర్వహించనున్నారు. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ యజమానులు ఇప్పుడు విదేశీ ఆటగాళ్ల లభ్యతపై స్పష్టత ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కోరుతున్నారు.
PSL ఫ్రాంచైజీకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, కొంతమంది యజమానులు తమ సమస్యలను పరిష్కరించడానికి త్వరలో సమావేశాన్ని పిలవాలని కోరుతూ PSL డైరెక్టర్ సల్మాన్ నసీర్‌కు లేఖ రాశారు. ఒకవేళ ఐపీఎల్ సమయంలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ అయితే, టోర్నీకి ఏ విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రసారాలు షెడ్యూల్‌లపై స్పష్టత ఇవ్వాలని యాజమాన్యం పీసీబీని కోరినట్లు పీటీఐ పేర్కొంది.పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై ఉన్న సందేహలపై ఫ్రాంచైజీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, తదితర బోర్డులు తమ ఆటగాళ్లు లీగ్‌లలో ఆడటంపై ఆంక్షలపై చర్చించాయి. PSL ఆటగాళ్ల డ్రాఫ్ట్‌పై స్పష్టత అవసరమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందుకు ఓ డిమాండ్ వచ్చింది.
ఇది చదవండి: ఇంత వైల్డ్‌గా ఉన్నావేంటి సామి..ఆ కొట్టుడు ఏంది.. 8 బంతుల్లో 8 సిక్సులు..
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
పాకిస్థాన్ సూపర్ లీగ్ సాధారణంగా ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుంది. అయితే ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీని కాస్త లేట్ అయ్యేలా ఉంది. PSL ఒక నెల ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఏప్రిల్-మే మధ్య పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహించాల్సి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు కనిపించనున్నారు. పీఎస్ఎల్ నుంచి ఆటగాళ్లు వైదొలగనున్నారు. అందుకే ఇప్పుడు జరగబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ పై యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే త్వరలో సమావేశం కావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును వారు అభ్యర్థిస్తున్నారు.
ఇది చదవండి: రేపటి నుంచే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైమింగ్స్, షెడ్యూల్ మీద ఓ లుక్కెయండి !
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి-మార్చి మధ్య టోర్నీ నిర్వహించేందుకు పీసీబీ ముసాయిదా షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. అయితే పాకిస్థాన్‌లో టోర్నీ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తేనే భారత జట్టు టోర్నీలో పాల్గొంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధంగా లేదు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ పీసీబీకి ఆందోళనను పెంచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కొత్త తలనొప్పిగా మారింది. దీంతో PCBకి ఒకేసారి రెండు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థతి వచ్చింది.
ఇది చదవండి: పాక్ మొండి వైఖరి.. షెడ్యూల్ తేదీలు ప్రతిపాదన.. ఆ స్టేడియంలోనే అన్ని మ్యాచులు..